jamboo savari : పెనుకొండలో కన్నులపండువగా జంబూ సవారీ

author img

By

Published : Oct 15, 2021, 10:37 PM IST

కన్నుల పండువగా జంబూ సవారీ

ప్రతి ఏటా విజయదశమి రోజున వివిధ దేవాలయల్లోని ఉత్సవ విగ్రహాలను జమ్మి చెట్టు వద్దకు జంబూ సవారీ (ఊరేగింపుగా)తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి తిరిగి ఆయా దేవాలయాలకు ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది.


అనంతపురం జిల్లా పెనుకొండలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవ విగ్రహాలను జమ్మి చెట్టుకు తీసుకువెళ్లి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఏటా విజయదశమి రోజున ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ మహమ్మారితో ఉత్సవాలు జరపలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జంబూ సవారీ (విగ్రహాల ఊరేగింపు) తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

కన్నుల పండువగా జంబూ సవారీ

ఇదీ చదవండి:

Suicide: ఆసుపత్రి భవనం పైనుంచి దూకి.. రోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.