ETV Bharat / state

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

author img

By

Published : Jul 1, 2020, 9:31 AM IST

Updated : Jul 1, 2020, 11:11 AM IST

ధర్మవరంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీ నగర్​కు చెందిన గౌతమి లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీకి చెందిన శివ శంకర్ 4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీ నగర్​కు చెందిన గౌతమి.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీకి చెందిన శివ శంకర్ 4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావటంతో మనస్తాపం చెందిన గౌతమి పుట్టింట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త శివ శంకర్.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:కరోనా వైరస్​పై ఆటోల ద్వారా అవగాహన

Last Updated : Jul 1, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.