ETV Bharat / state

లాక్​డౌన్​లోనూ.. లాభాల కూత

author img

By

Published : Apr 28, 2020, 5:14 PM IST

లాక్​డౌన్​తో రైల్వే వ్యవస్థ స్తంభించినా... గుంతకల్లు రైల్వే డివిజన్​ మాత్రం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సరకుల రవాణా చేసి ఆదాయంలో ముందుంది.

gunhakallu railway division earning profits in lockdown
లాక్డౌన్లోనూ.. లాభాల కూత

లాక్​డౌన్​తో దేశంలోని అన్ని వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిది. కానీ... దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లోని గుంతకల్లు డివిజన్ మాత్రం ఆదాయం ఆర్జించడంలో ముందు వరసలో నిలిచింది. దేశం మొత్తంగా 3597 ప్రాంతాలకు రవాణా చేసి 1.56 కోట్లరూపాయలు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ ఆలోక్ తివారి తెలిపారు.

లాక్డౌన్ సమయంలోనూ ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణాలో గుంతకల్లు డివిజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు 66 రాక్స్ బియ్యం, 1 రాక్ గోధుమలు, 6 రాక్స్ ఎరువులు, 2 రాక్స్ సిమెంట్, ఇనుము, సున్నపురాయితో పాటు ఎర్ర మట్టి రవాణా చేసింది. రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు... కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి జిల్లాల ప్రజలకు నిత్యావసర సరకులను గమ్యాలకు చేర్చింది.

రైతులు పండించిన కూరగాయలు, కరేపాకు, పుచ్చకాయ, మామిడి కాయలు వంటి వస్తువులను దేశ రాజధానికి కూడా రవాణా చేసి లాభాలు ఆర్జించింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.