ETV Bharat / state

తాడిపత్రి ఘర్షణ కేసు: ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్

author img

By

Published : Dec 30, 2020, 3:07 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఉపయోగించిన కారును పోలీసులు సీజ్‌ చేశారు.

five ysrcp leaders arrested in jc prabhaker reddy attack issue
తాడిపత్రి ఘర్షణ కేసు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 24న జరిగిన వైకాపా, తెదేపా నాయకుల ఘర్షణ కేసులో ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పలపాడు రవి, బాబా, కేశవరెడ్డి, ఓబుల్​ రెడ్డి, రమణలను అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన కారును పోలీసులు సీజ్‌ చేశారు.

తాడిపత్రి పట్టణంలో ఈ నెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లికి వెళ్లి.. ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.

ఇదీ చదవండి: తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.