ETV Bharat / state

న్యాయవిద్య ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటిరోజు ముగిసిందిలా...

author img

By

Published : Feb 16, 2021, 10:04 PM IST

న్యాయవిద్య ప్రవేశాల్లో కౌన్సెలింగ్​కు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు స్థానిక విద్యార్థులు ఈరోజు హాజరైనట్లు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు రోజుల పాటు వివిధ యూనివర్సిటీల్లో ఈ ప్రక్రియ జరగనుందన్నారు.

lawcet counselling first day completed in various universities
ముగిసిన న్యాయవిద్య ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటిరోజు

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిద్య ప్రవేశాలకు మొదటి రోజు కౌన్సెలింగ్ ఇవాళ ముగిసింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యార్థులు హాజరైనట్లు వీసి రామకృష్ణారెడ్డి తెలిపారు. 1 నుంచి 2,500 ర్యాంకు వరకు ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. మూడు రోజులపాటు కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని.. సమయం వృథా చేయకుండా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

బత్తలపల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.