భూవివాదం.. న్యాయం చేయడం లేదని సెల్​ టవర్​ ఎక్కిన రైతు

author img

By

Published : Sep 25, 2022, 12:52 PM IST

Farmer climbing the cell tower

Farmer Tried To Suicide: పోలీసులు నిత్యం పోలీస్​స్టేషన్​కు పిలుస్తూ వేధిస్తున్నారని ఓ రైతు సెల్​ టవర్​ ఎక్కాడు. తన సమస్యను పరిష్కరించకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని గంటసేపు టవర్​ పై హల్​చల్​ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.

Farmer Tried To Suicide: సొంత భూమి కోసం సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం చేయటం లేదని ఆత్మహత్యకు యత్నించాడో రైతు. ఆ రైతు భూమిలో తనకు హక్కు ఉందని సమీప బంధువు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అందువల్ల పోలీసులు పలుమార్లు స్టేషన్​కు పిలిపించి.. న్యాయం చేయటం లేదని సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు.

అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీరాములు, సుజాతమ్మల కుమారుడు పురుషోత్తం. ఇతనికి వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇతని బంధువు సుబ్బరాయుడు.. పురుషోత్తం తండ్రి శ్రీరాముల మధ్య నాలుగేళ్లుగా భూతగాదా నడుస్తోంది. పురుషోత్తం కుటుంబానికి చెందిన భూమిలో 56 సెంట్లు భూమి తనకు వస్తుందని సుబ్బరాయుడు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రతిసారి స్టేషన్​కు పిలిచి న్యాయం చేయకుండా.. తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. పురుషోత్తం గార్లదిన్నెలో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు గంటపాటు టవర్​ పైన ఉన్న పురుషోత్తంకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో కిందకు దిగాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.