ETV Bharat / state

మండలి రద్దుపై త్వరలో నిర్ణయం: అంజాద్ బాషా

author img

By

Published : Jan 25, 2020, 12:10 PM IST

రాజధానుల బిల్లులపై మండలి చర్చ జరుగుతున్న సమయంలో ఛైర్మన్​ను మంత్రులు బెదిరించారన్న ఆరోపణలపై వాస్తవం లేదన్నారు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. బిల్లు సెలక్టు కమిటీకి పంపే అవసరం లేదని ఛైర్మన్​ చెప్పనప్పటికీ తెదేపా నేతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించవద్దని అన్ని పార్టీలు మండలి ఛైర్మన్​ను కోరినా... ఛైర్మన్ విచక్షణాధికారాల పేరిట చంద్రబాబు చెప్పినట్లు నడుచుకున్నారని అంజాద్ బాషా ఆరోపించారు. మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Deputy cm Amzad basha on ap council abolish
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

తెదేపాపై ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా విమర్శలు
మండలిలో తనను ఎవరూ బెదిరించలేదని ఛైర్మన్ చెప్పినప్పటికీ తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర సమగ్రాభివృద్ధికే అని ఆయన స్పష్టం చేశారు. రాజధానుల బిల్లులను మండలిలో అడ్డుకోవాలని చూడటం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని తమతో పాటు అన్ని పార్టీల సభ్యులు ఛైర్మన్​ను కోరినప్పటికీ.. విచక్షణాధికారాల పేరిట తెదేపా అధినేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకున్నారని విమర్శించారు. తెదేపా తీరును ప్రజలు గమనిస్తున్నారని, కుల, మతాల పేరిట ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి రద్దుపై సోమవారం జరిగే చర్చ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

'తండ్రి ఆశయాలకు తనయుడు తూట్లు..!'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.