ETV Bharat / state

బ్యాంకు ముందు క్యూ కట్టిన ఖాతాదారులు.. పట్టింపులేని అధికారులు

author img

By

Published : May 17, 2021, 12:50 PM IST

కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా.. ప్రజలు భౌతిక దూరాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఇందుకు చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న కెనరా బ్యాంకు వద్ద అన్నదాతలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంపై.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకుకు క్యూ కట్టిన ఖాతాదారులు.. గుంపులుగా చేరిన జనం
బ్యాంకుకు క్యూ కట్టిన ఖాతాదారులు.. గుంపులుగా చేరిన జనం

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా.. ఇంకా కొందరు భౌతిక దూరం పాటించడం లేదు. ఇందుకు చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనంతపురంలోని టవర్ క్లాక్ పరిసరాల్లో ఉన్న కెనరా బ్యాంకు ముందు.. రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. భౌతిక దూరం మాటే మరిచిన వారి తీరును.. అధికారులూ పట్టించుకోకపోవడంపై.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు క్యూలో గుంపు..

రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ కట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్న కారణంగా రైతులు బ్యాంకుకు వచ్చారు. వీరితో పాటు ఖాతాదారులూ వచ్చిన కారణంగా... బ్యాంకు వద్ద జనం గుమిగూడారు. భౌతిక దూరం పాటించాలని.. లేకపోతే వ్యాధి సోకే ప్రమాదం ఉందని సిబ్బంది హెచ్చరించినా వాళ్లు పట్టించుకోవట్లేదు. బ్యాంకు ఉన్నతాధికారులూ ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడం.. సమీప ప్రజలను ఆందోళనకు గురి చేసింది.

ఇవీ చూడండి:

రఘురామ కేసు: సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.