ETV Bharat / state

ఉద్యోగం ఇప్పిస్తానని.. లక్షలు తీసుకొని.. మోసం చేసిన అటెండర్..

author img

By

Published : Jan 24, 2023, 11:42 AM IST

Attender Cheated the Lady
మహిళను మోసం చేసిన అటెండర్

Attender Cheated the Lady: ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు.. లక్షల రూపాయలను తీసుకున్నాడు. తీరా ఫోన్ చేస్తూ ఉంటే.. స్పందించేవాడు కాదు. దీంతో బాధిత మహిళ మోసపోయానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించింది. దీనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదంతా చేసింది అనంతపురం జిల్లా గుంతకల్లులో.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.

ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను మోసం చేసిన అటెండర్

Attender Cheated the Lady: ఉద్యోగం పేరిట నగదు తీసుకుని యువతిని మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలుగులోకి వచ్చింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా తిప్పేస్వామి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని.. పట్టణానికి చెందిన లోకేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలం నుంచి బాధిత యువతి.. తిప్పేస్వామిని చరవాణిలో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. దీంతో కసాపురం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన తిప్పేస్వామి పైన చట్టపరమైన చర్యలు తీసుకోని.. తాను ఇచ్చిన నగదును తిరిగి ఇప్పించాలని కోరింది. చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

"ఉద్యోగం ఇప్పిస్తానంటే రెండు లక్షలు ఇచ్చాను. ఫోన్ చేస్తే.. కట్ చేస్తున్నాడు. డబ్బులు అడుగుతూ ఉంటే.. ప్రస్తుతం నా దగ్గర లేవు అంటున్నాడు". - లోకేశ్వరి, బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.