ETV Bharat / state

MURDER: వివాహేతర సంబంధాలు.. తీశాయి ఓ వ్యక్తి ప్రాణం

author img

By

Published : Aug 19, 2021, 10:36 PM IST

అనంతపురం జిల్లా ఎదురూరు గ్రామంలో ఓ వ్యక్తి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేధించారు. తప్పిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కృష్ణా నదిలో గుర్తించారు. వివాహేతర సంబంధాలు.. ఓ వ్యక్తి దిక్కులేని చావుకు కారణమయ్యాయని తాడిపత్రి డిఎస్పీ చైతన్య తెలిపారు.

a man broduly murder at Anantapur
వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా ఎదురూరు గ్రామానికి చెందిన పెద్దయ్య అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తప్పిపోయాడనుకున్న పెద్దయ్య.. తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద కృష్ణా నదిలో శవమై తేలాడు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు.

పామిడి మండలం ఎదురూరుకు చెందిన పెద్దయ్య.. వివాహానికి ముందు నుంచి అదే గ్రామానికి చెందిన సుంకమ్మతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. సుంకమ్మ మేనమామ శంకర్.. పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై పెద్దయ్య, శంకర్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏమైనా చేస్తాడేమోనని పెద్దయ్య భార్య శంకర్​కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన శంకర్.. తానే పెద్దయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మాయమాటలు చెప్పి తన మేనకోడలు సుంకమ్మతో పెద్దయ్యకు ఫోన్ చేయించి పత్తికొండకు రప్పించాడు.

అక్కడే పథకం రూపొందించాడు..

పత్తికొండలో పెద్దయ్య హత్యకు పథకం రచించిన శంకర్.. మిత్రులు కుంటి శ్రీనివాస్, తుపాన్ డ్రైవర్ భాస్కరరెడ్డి సహకారం తీసుకున్నాడు. పెద్దయ్యతో మాట్లాడుతూనే టవల్ మెడకు బిగించి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పామిడి వద్ద పడేయాలనుకున్నాడు. అ మార్గంలో పోలీస్ చెకింగ్ ఉందని భాస్కరరెడ్డి చెప్పడంతో శవాన్ని తెలంగాణలోని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో పడేయగా... ఇటిక్యాల వద్ద తేలింది.

పెద్దయ్య ఆడియో సంభాషణతో గుట్టురట్టు

పత్తికొండలో శంకర్​తో మాట్లాడుతున్నప్పుడు వారి ప్రవర్తనపై అనుమానం కలిగిన పెద్దయ్య.. తాను ఎక్కడ ఉన్నాడో తెలిసేలా సుంకమ్మతో చివరిసారిగా మాట్లాడిన సంభాషణను తన మిత్రులకు షేర్ చేశాడు. దీని ఆధారంగానే చివరగా పెద్దయ్య ఎక్కడికి వెళ్లాడన్న విషయం తెలిసింది. ఐదు రోజులుగా పెద్దయ్య కనిపించట్లేదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దయ్య పంపిన ఆడియో సంభాషణతోపాటు.. పెద్దయ్య భార్య, సుంకమ్మ, శంకర్ మధ్య మద్య జరిగిన సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. రెండు వివాహేతర సంబంధాలు.. ఓ వ్యక్తి చావుకు కారణమయ్యాయని డీఎస్పీ చైతన్య తెలిపారు.

ఇదీ చదవండి..

DEATH: బీటెక్ విద్యార్థి మృతి.. ఫీజు వేధింపులే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.