ETV Bharat / state

"మార్గదర్శిపై కక్ష సాధింపులు మానకపోతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు"

author img

By

Published : Apr 11, 2023, 7:06 PM IST

Updated : Apr 12, 2023, 6:21 AM IST

TDP Leader Ayyanna On Margadarsi And Ramoji Rao: మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకపోయినప్పటికీ ఏపీ సీఐడీ అధికారులు వేధింపులు చేయడం తగదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ కేవలం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని.. ఇది ఏమాత్రం సరైనది కాదని హితవు పలికారు.

tdp leaders
tdp leaders

TDP Leader Ayyanna On Margadarsi And Ramoji Rao: సుమారు 60 సంవత్సరాలుగా ఇటు పత్రికా రంగంతో పాటు వివిధ వ్యాపార సంస్థలను పరిచయం చేసి.. ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యక్తిగా గుర్తింపు పొందిన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపై కక్ష సాధింపు చర్యలు తగవని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు ప్రజల్లో రామోజీరావు చైతన్యం నింపారని కొనియాడారు.

ఫిర్యాదు లేకపోయినా వేధింపులు సరికాదు: నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి పచ్చళ్ళు పరిచయం చేసి.. వారి మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి అని అయ్యన్న వివరించారు. ప్రధానంగా తెలుగువారితో పాటు ప్రపంచ దేశాలు గర్వించే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో ఫిలిం సిటీ స్థాపించి ఎంతో మందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. కరోనా విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో సైతం సహాయం చేసి ఆదుకున్న వ్యక్తిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు భావ్యం కావన్నారు. మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకపోయినప్పటికీ ఏపీ సీఐడీ అధికారులు వేధింపులు చేయడం తగదన్నారు.

కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారు: 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు 108 బ్రాంచీలో దిగ్విజయంగా నడుపుతున్నారన్నారు. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ కేవలం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని.. ఇది ఏమాత్రం సరైనది కాదన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీపై ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలను అయ్యన్న మరోసారి గుర్తు చేశారు.

లక్షల మందికి ఉపాధి కల్పించిన రామోజీరావుపై బురద జల్లడం పద్ధతి కాదు: ఆర్ధిక నేరగాడైన జగన్‌.. దేశానికే గర్వకారణమైన రామోజీరావుని ఇబ్బంది పెట్టడంపై.. ప్రజలు ఆలోచించాలని అయ్యన్న పాత్రుడు కోరారు. మార్గదర్శి ద్వారా.. లక్షల మందికి ఉపాధి కల్పించిన రామోజీరావుపై బురద జల్లడం జగన్‌కి పద్దతి కాదని హితవు పలికారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు పనులకు స్వస్తి పలకాలన్నారు.

కక్ష సాధింపులు మానకపోతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు: ప్రభుత్వ అవినీతిని ఈనాడు పత్రిక బయటపెడుతున్నందునే.. మార్గదర్శిపై అక్రమ కేసులతో జగన్‌ వేధిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. కక్ష తీర్చుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించడాన్ని తప్పుపట్టారు. కక్ష సాధింపులు మానుకోకపోతే ..రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని.. కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు.

అవినీతిని ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా: రాజ్యాంగ వ్యవస్థల్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వైసీపీ వినియోగిస్తోందని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులపై కక్ష సాధింపుల కోసం సీఐడీని వాడటం జగన్‌ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీయటానికి.. సీఐడీని ప్రయోగించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా అని నిలదీశారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 12, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.