ETV Bharat / state

వినూత్న ఆలోచన.. వక్క ఆకుతో ప్లేట్లు

author img

By

Published : Jan 30, 2023, 2:20 PM IST

Leaf Plates: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం వెతికి కాలుష్యాన్ని నివారించేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన కృష్ణమాచారి అనే వ్యక్తి సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే.. వక్క ఆకుతో ప్లేట్లు తయారు చేస్తున్నారు. హోటళ్లు, వివాహ విందులు సహా సామూహిక భోజనాల్లో వినియోగిస్తున్న ఈ వక్క ఆకు ఉత్పత్తుల్ని ఇప్పుడు చూద్దాం.

Leaf Plates
ఆకుతో ప్లేట్లు

వక్క ఆకుతో ప్లేట్లు

Leaf Plates: ఒక్కసారి వినియోగించి పడేసే సామగ్రితో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. దీంతో చాలామంది ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాపర్తివానిపాలేనికి చెందిన కృష్ణమాచారి.. వినూత్నంగా ఆలోచించి అరెకా లీఫ్‌ ప్లేట్లు తయారు చేస్తున్నారు. లక్కీ యాపిల్ అరేకా లీఫ్ ప్లేట్ మాన్యుఫాక్చరర్స్‌ యూనిట్ నెలకొల్పారు. ప్లాస్టిక్‌లా సౌకర్యంగా ఉండేలా ఈ ప్లేట్ల తయారీని ప్రారంభించారు. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేకమైన అరెకా లీఫ్‌తో ప్లేట్లు తయారుచేస్తూ తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నారు.

బెంగళూరు నుంచి ఆకును తీసుకురావడం.. వాటిని శుద్ధిచేయడం కొంత ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ.. లాభంతో సంబంధం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ కృషి చేస్తున్నామని కృష్ణమాచారి చెబుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే వీటికి అలవాటు పడుతున్నారని తెలిపారు. ఈ ప్లేట్‌లో భోజనం చేయాలనే ఉద్దేశంతో తమ వద్దకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం ఉంటే.. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తులు మరిన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని కృష్ణమాచారి చెబుతున్నారు.

"వక్క ఆకులతో మేము వివిధ సైజులలో ప్లేట్లను తయారుచేస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం విధించిన తరువాత.. ఇది ప్రత్యామ్నాయ వస్తువు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఆకు బెంగళూరు నుంచి వస్తుంది. మంచి నాణ్యత కలిగిన ప్లేట్లను అందించాలనేది మా ప్రాధాన్యత". - కృష్ణమాచారి, ప్లేట్ల తయారీ సంస్థ యజమాని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.