ETV Bharat / state

"మీరు చెప్పినట్లే చేశాను.. ఇప్పుడు మాట మార్చొద్దు.. నిజం చెప్పండి"

author img

By

Published : Jun 3, 2022, 9:48 AM IST

CONFLICT: పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు రెండు చెరువుల మధ్యలో నుంచి ఏర్పాటుచేసుకున్న బాటను రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్‌తో గుంతలు పెడుతుండటాన్ని సర్పంచి, స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఆర్‌ఐపై తహసీల్దారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘మీరు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు మాట మార్చొద్దు. నిజం చెప్పండి’ అంటూ ఆర్‌ఐ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో చోటుచేసుకుంది.

CONFLICT
CONFLICT

CONFLICT: పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు రెండు చెరువుల మధ్యలో నుంచి ఏర్పాటుచేసుకున్న బాటను రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్‌తో గుంతలు పెడుతుండటాన్ని సర్పంచి, స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దారు ఆర్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘మీరు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు మాట మార్చొద్దు. నిజం చెప్పండి’ అంటూ ఆర్‌ఐ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రాజుపేట శివారు రామన్నపాలెం గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్లేందుకు కొద్దిరోజుల కిందట నీలాపు, సూరపు చెరువుల మధ్యలో నుంచి బాటను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు చెరువు భూమిని ఆక్రమించి రోడ్డేశారని ఆరోపిస్తూ తహసీల్దారు ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం ఆర్‌ఐ ప్రసాద్‌, వీఆర్వో సూరిబాబు గురువారం రామన్నపాలెం వచ్చారు. రైతులు ఏర్పాటు చేసుకున్న బాటను పొక్లెయిన్‌తో గోతులు తవ్విస్తుండగా సర్పంచి బొడ్డేటి వెంకటరమణ రైతులతో అక్కడకు చేరుకుని ఆర్‌ఐ, వీఆర్వోను అడ్డుకున్నారు.

ఆర్‌ఐ ఈ విషయాన్ని తహసీల్దారుకు ఫోన్‌ చేసి చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత ప్రసాదరావు రాగా రైతులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫిర్యాదు రావడంతో విచారణకు పంపానని, పొక్లెయిన్‌తో ఎందుకు గోతులు తవ్విస్తున్నారని ఆర్‌ఐ ప్రసాద్‌పై తహసీల్దారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు వెళ్లమంటేనే కదా ఇక్కడకు వచ్చాం. పొక్లెయిన్‌తో గోతులు తవ్వించకపోతే సస్పెండ్‌ చేస్తానని బెదిరించారా? లేదా?.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు. నిజం చెప్పండి’ అంటూ ఆర్‌ఐ ప్రసాద్‌ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగాడు. నిజం చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ చొక్కా విప్పి తహసీల్దార్‌ కారు ఎదుట బైఠాయించాడు. అనంతరం పొలాల్లోకి పరుగు తీయడంతో రైతులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ ప్రసాదరావు వెంటనే ఎస్సై నారాయణరావుకు ఫోన్‌ చేయడంతో సిబ్బందితో అక్కడకు చేరుకొని ఆర్‌ఐకు సర్దిచెప్పారు. అనంతరం తహసీల్దార్‌ రైతులతో మాట్లాడుతూ.. నాలుగు సెంట్ల భూమి మినహా చెరువులు ఆక్రమణకు గురికాలేదని సర్వేలో తేలిందని చెప్పారు. చెరువులో నుంచి ఏర్పాటు చేసుకున్న బాట మీదుగా రాకపోకలు సాగించవచ్చని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.