ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Dec 9, 2022, 5:02 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • రాష్ట్రంలో చిత్తశుద్ధి లేని పాలన నడుస్తోంది: నాదెండ్ల మనోహర్​
    Nadendla Manohar: రాష్ట్ర విభజన గురించి వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ స్పందించారు. ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీ పెద్ద కుంభకోణమని... భూముల రేట్లు అధికంగా ఉన్నారని దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏడెకరాలు అమ్మినా అప్పు తీర లేదు.. యువరైతు ఆత్మహత్య
    Farmer suicide in Kadapa district: రైతులకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వాలు మాటలు చెప్తున్నా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా అప్పుల బాధ తట్టుకోలేక మరో యువరైతు మృతి చెందాడు. ఎనిమిదెకరాల రైతు, ఏడు ఎకరాలు అమ్మినా అప్పుల తీరలేదు. చివరికి తానే ప్రాణాలు తీసుకొని.. భార్యా ముగ్గురు పిల్లలను ఒంటరి చేసిన ఘటన వైఎస్సార్​ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశ పరివర్తన కోసమే.. 'అబ్‌ కీ బార్ కిసాన్‌ సర్కార్' నినాదంతో బీఆర్​ఎస్​'
    CM KCR on BRS Party: దేశ పరివర్తన కోసమే.. 'అబ్‌ కీ బార్ కిసాన్‌ సర్కార్' నినాదంతో బీఆర్​ఎస్ ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని నినదించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదన్నారు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారన్న కేసీఆర్.. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైఎస్సార్‌ జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల ఖాతాలు సీజ్ చేసిన ఈడీ
    ED seizes bank accounts of cyber criminals in Kadapa case: మేకింగ్‌ మనీ యాప్‌, ఆర్​సీసీల పేరిట కోట్ల సొమ్మును కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు.. తదుపరి చర్యల కోసం ఈడీకి సిఫారసు చేశామన్నారు. నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఈడీ జప్తు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రహదారి దుస్థితిపై అనపర్తిలో టీడీపీ వినూత్న నిరసన
    Road Situation In Anaparti With tdp Flexi: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గోతులమయంగా తయారయ్యాయి. గోతుల రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. తాజాగా అనపర్తి కెనాల్​ రహదారి దుస్థితిపై టీడీపీ వినూత్నంగా నిరసన తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 3 రోజులుగా బోరుబావిలోనే బాలుడు.. అధికారి కొడుకైతే ఇంత టైమ్ పట్టేదా అంటూ తల్లి సీరియస్​
    ఆడుకుంటూ 400 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు.. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంకా బాలుడి రెస్క్యూ ఆపరేషన్​ పూర్తికాకపోవడం వల్ల అతడి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఒక నాయకుడి లేదా అధికారి కన్నకొడుకు అయితే ఇంత సమయం పట్టేదా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజ్యసభ ముందుకు​ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు.. విపక్షాల నిరసనల మధ్యే..
    ఎగువసభలో భాజపా సభ్యుడు కిరోడి లాల్.. ఉమ్మడి పౌర స్మృతి 2020 బిల్లును ప్రైవేటుగా ప్రవేశపెట్టారు. బిల్లును అనుమతించాలా లేదా అనే విషయంపై ఓటింగ్​లో 63 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా.. 23 మంది వ్యతిరేకించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎలాన్​ మస్క్​ 'ట్విట్టర్​ ఫైల్స్​ 2'.. ఆ పని చేసిందంతా వాళ్లే..!
    ఇటీవల ట్విట్టర్ ఫైల్స్​ను ఆసరాగా చేసుకుని సంస్థ మాజీ ప్రతినిధులపై ఆరోపణలు గుప్పించిన మస్క్​.. తాజాగా 'ట్విట్టర్​ ఫైల్స్ పార్ట్​ 2' విడుదల చేశారు. పాత యాజమాన్యం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. ఇందులో పాత యాజమాన్యం చట్ట విరుద్ధంగా చేసిన పనుల వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాకిస్థాన్ బౌలర్ సూపర్ రికార్డ్​.. అరంగేట్ర మ్యాచ్​లోనే ఏడు వికెట్లు
    అరంగేట్రంలోనే అదిరే ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు పాకిస్థాన్​ లెగ్​ స్పిన్నర్​ అబ్రార్​ అహ్మద్​. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు ఏకంగా ఏడు వికెట్లతో అదరగొట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ భార్యతో కలిసి పూజ చేసిన ఆమిర్​.. గెస్ట్​గా ఆ సినిమా డైరెక్టర్​
    బాలీవుడ్​ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్‌రావుతో కలిసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.