ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Nov 9, 2022, 4:59 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టు షాక్.. భారత్​కు అప్పగించాలని ఆదేశం
    వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!
    పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ సమర్పించడంలో విఫలమైన కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా సవివర నివేదిక సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "సీఎం జగన్‌ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే పోస్టులు ఇస్తున్నారు"
    TDP leader Somireddy: సీఎం జగన్‌ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే సలహాదారులు, డీఎస్పీ పోస్టులు ఇస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గతంలో డీఎస్పీ బదిలీల విషయంలో తెదేపా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సోమిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఏటా కొనుగోళ్ల లక్ష్యం తగ్గిస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి సన్మానాలా.. వామపక్ష పార్టీల ఆగ్రహం
    PM Modi visit AP: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతామని చెప్పాకే.. ప్రధాని మోదీ ఏపీలో అడుగు పెట్టాలని.. వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈనెల 11, 12 తేదీల్లో మోదీకి నిరసన తెలుపుతామని, ప్రజలూ నల్ల జెండాలు ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. విభజన హామీల కోసం మెడలు వంచుతానన్న జగన్‌.. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని సన్మానాలు చేస్తారని.. ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పౌరసరఫరా శాఖలో రూ. 40 కోట్ల కుంభకోణం.. ఏసీబీ దాడులు
    scam in Civil Supplies Department: పౌరసరఫరా శాఖ కార్యాలయంలో రూ. 40 కోట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఈ కేసులో డీఎం పద్మాను సస్పెండ్ చేసి జుడిషియల్ కస్టడిలోకి తీసుకున్నారు. ఈ ఆమె రోజు ఆస్తులపై అనిశా దాడులు చేశారు. స్కాంలో ప్రదాన నిందితులుగా ఉన్న డీఎం పద్మా, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ నివాసాలపై దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్పపీడన ప్రభావం.. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
    AP Weather: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 10, 11న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నకిలీ బ్యాంక్​తో భారీ స్కామ్.. 10 బ్రాంచ్​లు నడుపుతూ కోట్లు మోసం.. చివరకు..
    నకిలీ బ్యాంక్​ను స్థాపించిన ఓ వ్యక్తి దాని ద్వారా ఆ ప్రాంతంలోనే పలు బ్రాంచ్​లను ఏర్పాటు చేసి ఖాతాదారులను మోసం చేయాలనుకున్నాడు. అలా 2 కోట్లతో పరారవ్వాలనుకున్న ఓ వ్యక్తి ఆఖరికి కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల జోరు.. బైడెన్​కు కష్టకాలమే!
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠకు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా మారిన అమెరికా మధ్యంతర ఎన్నికలపై సర్వే ఫలితాలు కలకలం రేపుతున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా ప్రాంతాల్లో రిపబ్లికన్ల జోరు కనిపిస్తోందని, అధ్యక్షుడు బైడెన్‌కు షాక్‌ తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ స్టేడియంలో బ్యాట్ పడితే కోహ్లీకి పూనకమే!
    నవంబరు 10న అడిలైడ్​ ఇంగ్లాండ్​తో టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​ ఆడనుంది టీమ్ఇండియా. అయితే ఈ మైదానంతో కోహ్లీ ఓ ప్రత్యేకమైన బంధం ఉంది. విరాట్​ ఆ మైదానంలో బ్యాట్​ పట్టి బరిలో దిగాడంటే ప్రత్యర్థికి చుక్కలే! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జేమ్స్​ కామెరూన్​ సంచలన నిర్ణయం.. అలా జరిగితే అవతార్​ సీక్వెల్స్​ లేనట్టేనట
    'అవతార్'​ సినిమా రూపంలో ప్రపంచ సినీ ప్రియులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించిన దర్శకుడు జేమ్స్​ కామెరూన్..​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలా జరిగితే తదుపరి సీక్వెల్స్​ను తెరకెక్కించనని ప్రకటించారు. కామెరూన్​ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు షాక్​ అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.