ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యేల హత్య కేసు.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రైనో అరెస్ట్

author img

By

Published : Feb 22, 2023, 9:54 PM IST

Updated : Feb 23, 2023, 6:24 AM IST

maoist arrest : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసులో ప్రధాన నిందితుడైన రైనోను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల సమయంలో అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కాగా, రైనోపై రూ.5లక్షల రివార్డు ఉంది.

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ
అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ

maoist arrest : మావోయిస్టుల చేతిలో 2018లో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసులో ప్రధాన నిందితుడు రైనో అరెస్టయ్యాడు. అంధ్రా ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల సమయంలో ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఏవోబి ప్రత్యేక జోన్ డివిజనల్ కమిటీ సభ్యుడు జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో మూడు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఐదులక్షల రివార్డు పట్టిచ్చిన వారికి ఉంది.

ప్రధాన నిందితుడు... ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సొమల హత్యోదంతంలో ప్రధాన నిందితుడు ఏవోబి ప్రత్యేక జోన్ డివిజనల్ కమిటీ సభ్యుడు రైనో... ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్​గడ్ రాష్ట్రాలలో మావోయిస్టు విధ్వంసకర కార్యక్రమాలు, హత్య కేసుల్లో కీలక పాత్ర పోషించాడన్నది పోలీసుల అభియోగం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నవ్యక్తి ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల సమయంలో అరెస్ట్ చేశారు. జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో గా ఈ మావోయిస్టు నేత సీలేరు ప్రాంతానికి చెందినవాడు. ఏవోబిపై గట్టి పట్టు ఉంది.

23ఏళ్లుగా దళాల్లో... రైనో 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరి ఎల్లవరం, గుర్తేడు, నందపూర్ దళాల్లో పని చేశాడు. ఏవోబీ టెక్నికల్ బృందం, సీఆర్సీ మూడో కంపెనీ కమాండర్ గా, అగ్రనేత ఆర్కే ప్రొటెక్షన్ స్క్వాడ్ లో కమాండర్ గా, ఐవోబీ మిలటరీ ప్లటూన్ కమాండర్ గా వివిధ హోదాలలో పనిచేశాడు. అనేక హింసాత్మక ఘటనలు, యాక్షన్ ప్లానింగ్ నేరాలతో ముఖ్య భూమిక పోషించాడు. ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి, కొరాపుట్ జిల్లాలలో పలు ముఖ్యమైన యాక్షన్లలో పాలు పంచుకున్నాడు.

కోర్టులో హాజరు పరుస్తాం.. అరెస్ట్ చేసిన సమయంలో రైనో నుంచి ఒక ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు వెల్లడించారు. గత 12 ఏళ్లుగా రైనో మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. ఏవోబీలో అనేక హింసాత్మక ఘటనలలో రైనో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నాడు. ఈయనను పట్టిచ్చిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల రివార్డును గతంలోనే ప్రకటించింది. రైనోను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు.

ఇవీ చదవండి :

Last Updated :Feb 23, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.