ETV Bharat / sports

IPL 2022: ముంబయి ఇండియన్స్​ వరుసగా రెండో ఓటమి

author img

By

Published : Apr 2, 2022, 7:32 PM IST

IPL 2022: రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన తమ రెండో లీగ్​ మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్​. ఈ మ్యాచ్​లో 23 పరగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.

IPL 2022
MUMBAI INDIANS VS RAJASTHAN ROYALS

IPL 2022: వరుసగా రెండో లీగ్​ మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్​. 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 170/8 పరుగులే చేయగలిగింది. దీంతో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్. ముంబయి ఓపెనర్​ ఇషాన్ కిషన్ (54), తిలక్​ వర్మ (61) పోరాడారు. పొలార్డ్​ (22) ఫర్వేలేదనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చాహల్​తో పాటు రాజస్థాన్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడం వల్ల ముంబయికి ఓటమి తప్పలేదు. రాయల్స్​ బౌలర్లలో చాహల్​ 2, సైనీ 2, బౌల్ట్, ప్రసిద్ధ్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్​ దిగిన రాజస్థాన్.. ఓపెనర్ జోస్ బట్లర్​ (100) చెలరేగడం వల్ల 193 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్​ కెరీర్​లో బట్లర్​కు ఇది రెండో సెంచరీ. రాయల్స్​ కెప్టెన్ సంజూ శాంసన్ (30), హెట్​మెయిర్ (35) రాణించారు. మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, టైమల్ మిల్స్ 3, పొలార్డ్​ ఒక వికెట్ పడగొట్టారు.

ఇదీ చూడండి: 'ధోనీ నిర్ణయాలు తీసుకోవడమేంటి?'- జడేజా షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.