ETV Bharat / sports

క్లీన్​స్వీప్​కై కివీస్​...పరువు కోసం భారత్​

author img

By

Published : Feb 9, 2019, 10:48 PM IST

కివీస్​-భారత్​ మధ్య జరుగుతోన్న మహిళల టీ20 సిరీస్​ ​తుది పోరు రేపు జరగనుంది. మూడు మ్యాచ్​ల్లో రెండు విజయాలు సాధించిన న్యూజిలాండ్​...క్లీన్​స్వీప్​ చేయాలని చూస్తోంది. చివరి మ్యాచ్​లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.

చివరి మ్యాచ్​లోనైనా గెలవాలనే పట్టుదలతో భారత జట్టు

కివీస్​-భారత్​ మధ్య చివరి టీ20 మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం ఉదయం 7గంటల 30 నిముషాలకు ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్​లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు మహిళా క్రీడాకారిణులు

  • 2nd T20I: New Zealand opt to field

    🇮🇳: Mandhana, Punia, Rodrigues, Harmanpreet (c), Bhatia, Hemalatha, Sharma, Reddy, R Yadav, Joshi, P Yadav

    🇳🇿: Bates, Devine, Gurrey, Satterthwaite (c), Martin, Peterson, Kasperek, Rowe, Kerr, Tahuhu, Mair #INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/j06eXOcj1p

    — Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • హ్యాట్రిక్​ ఓటములు:

మన అతివలు 2-1తో వన్డే సిరిస్​ గెలిచినా చివరి మ్యాచ్​ పరాభవం కలుపుకొంటే.. హ్యాట్రిక్​ ఓటములు చవిచూశారు. కాని రెండు టీ20ల్లో 23 పరుగులు, నాలుగు వికెట్ల తేడాతో గట్టి పోటీ ఇచ్చినా పరాజయం పొందారు.

  • భారమంతా సారథిపైనే:

2020 ప్రపంచకప్​కు జట్టును సిద్ధం చేసుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్న యాజమాన్యం... పొట్టి క్రికెట్​లో మిథాలీకి విరామం ఇవ్వనుంది. ఫలితంగా ప్రస్తుత సారథి హర్మన్​ ప్రీత్​ కౌర్​ పైనే బాధ్యత పడుతోంది. హామిల్టన్​లో జరగనున్న మూడో టీ20లో హర్మన్​ కెప్టెన్​​ ఇన్నింగ్స్​ ఆడితే ​...భారత జట్టు గెలవడం కష్టమేమి కాదు. కాని గత మ్యాచ్​ల్లో 17, 5 పరుగులు మాత్రమే చేసిన ఈమె​ ఆటతీరు అసంతృప్తి కలిగిస్తోంది.

' సిరీస్​ ఓడిపోవడం బాధగా ఉంది. కానీ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నాం. మేమంతా యువజట్టు. చాలా మందికి 30 మ్యాచ్​లు కూడా ఆడిన అనుభవం లేదు. టీ20ల్లో పది కన్నా తక్కువ మ్యాచ్​లు ఆడినవాళ్లే ఉన్నారు. నేర్చుకోవడానికి ఇంకా కష్టపడతాం'
- హర్మన్​ ప్రీత్​ కౌర్, భారత మహిళా టీ-20 కెప్టెన్

విఫలమవుతోన్న మిడిల్​ ఆర్డర్​:

రెండు మ్యాచ్​ల్లోనూ భారత్​ 140 పరుగుల మార్కును దాటలేకపోడానికి కారణం మిడిల్​ ఆర్డర్​ వైఫల్యమే. స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్జ్‌ మినహా ఒక్కరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. ప్రియా పునియా విఫలమవడం జట్టుకు మరింత నష్టం కలిగిస్తోంది.
  • జట్టులో దీప్తి శర్మ పరిస్థితే అయోమయంగా ఉంది. ఈమె ఆల్​రౌండర్​ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఈమె బదులు మరో క్రీడాకారిణిని ఎంపిక చేయని మేనేజ్​మెంట్​...ఏ స్థానంలో బరిలోకి దింపితే ఆడగలదో పరిశీలించి నిర్ణయించాల్సి ఉంది.

రాణిస్తోన్న కివీస్​ క్రీడాకారిణి:
న్యూజిలాండ్​ క్రికెటర్​ సుజీ బేట్స్​ 57 పరుగులతో మంచి ప్రదర్శన చేసినా వన్డే సిరీస్ గెలిపించలేకపోయింది. ప్రతీకారంగా రెండో టీ20​లో 62 పరుగులు చేసి సిరీస్​ అందించడంలో కీలక పాత్ర పోషించింది.

  • భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధానా(వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, దయలన్​ హేమలత, మాన్షి జోషి,అరుంధతి రెడ్డి, శిఖా పాండే, ప్రియా పునియా

  • కివీస్​ జట్టు:

అమీ సాటర్థ్వైట్ (సారథి),సుజీ బేట్స్, బెర్నాడిన్ బెజుయిడెన్హౌట్(వికెట్ కీపర్), సోఫీ డేవిన్, హేలే జెన్సెన్, కెయిట్​లిన్​ గుర్రె, లీ కస్పెరేక్, అమేలియా కెర్, ఫ్రాన్సెస్​ మాకే, కేటీ మార్టిన్, రోస్​మేరీ మెయిర్​, హన్నా రోవ్​, లీ తహుహు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.