ETV Bharat / sports

IND VS WI 2023 : అ'స్పిన్‌' మాయాజాలం.. విండీస్​ విలవల.. భారత్​కు​ ఇన్నింగ్స్ విజయం

author img

By

Published : Jul 15, 2023, 6:42 AM IST

Updated : Jul 15, 2023, 7:09 AM IST

IND VS WI 2023 : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ జట్టు.. ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ వివరాలు..

IND VS WI first test
IND VS WI 2023 : అ'స్పిన్‌' మాయాజాలం.. విండీస్​ విలవల

IND VS WI 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో టీమ్​ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగిసింది. భారత్‌ జట్టు.. ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ashwin vs west indies : మ్యాచ్ సాగిందిలా.. 312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది భారత్​.. 421/5 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కరీబియన్‌ జట్టు.. అశ్విన్ (7/71) స్పిన్‌ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్​ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్ర మ్యాచ్​లోనే శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న ప్రారంభంకానుంది.

అశ్విన్ మాయాజాలం.. విండీస్ పతనం.. ఫస్ట్​ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి వెస్టిండీస్​ను కోలుకోలేని దెబ్బకొట్టిన రవిచంద్రన్​ అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్పిన్‌ మాయాజాలంతో విండీస్​కు చుక్కలు చూపించాడు. దీంతో కరీబియన్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టాల్సి వచ్చింది. మొదట త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్​ను (7) జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అప్పుడు వెస్టిండీస్​ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపట్లోనే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (7) అశ్విన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలా టీ బ్రేక్​ సమయానికి 27/2తో నిలిచిన విండీస్ టీమ్​​.. లాస్ట్​ సెషన్‌లో ఏకంగా ఎనిమిది వికెట్లను పోగొట్టుకుంది. లాస్ట్​ సెషన్‌ ప్రారంభం అయిన వెంటనే బ్లాక్‌వుడ్​(5) అశ్విన్‌ బౌలింగ్​లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా బౌలింగ్​లో రీఫర్‌(11) పెవిలియన్‌ చేరాడు. ఇక సిరాజ్‌ బౌలింగ్‌లో ద సిల్వా (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

చివరి ఐదు అశ్వినే.. ఈ వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్​లో చివరి ఐదు వికెట్లు అశ్వినే తీయడం విశేషం. అథనేజ్‌ (28) స్లిప్‌లో యశస్వి జైస్వాల్‌ చేతికి చిక్కగా.. అల్జారీ జోసెఫ్‌ (13) శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. రఖీమ్‌ కార్న్‌వాల్‌ (4), కీమర్‌ రోచ్​లు(0) ఒకే ఓవర్‌లోనే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలోనే మూడో రోజు నిర్ణీత ఓవర్లు పూర్తైపోయాయి. అయితే ఆలౌట్‌ అవ్వడానికి.. విండీస్​కు ఒక్క వికెటే ఉండటం వల్ల.. మ్యాచ్‌ సమయాన్ని అరగంట పాటు పొడిగించారు. అయితే ఆఖర్లో మూడు ఫోర్లు బాదిన కాస్త ఊపు చూపించిన వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరికాడు. దీంతో కరీబియన్ జట్టు ఆలౌటైంది.

ఇకపోతే మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాలో యశస్వి జైస్వాల్‌ (387 బంతుల్లో 171; 16×4, 1×6) తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103; 10×4, 2×6) సెంచరీ బాదగా.. స్టార్‌ బ్యాటర్​ విరాట్ కోహ్లీ (182 బంతుల్లో 76; 5×4) హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా (82 బంతుల్లో 37*; 3×4, 1×6) కూడా మంచిగానే రాణించాడు. వెస్టిండీస్​ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, రఖీమ్‌ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్‌, వారికన్, అథనేజ్‌ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

ఇదీ చూడండి :

దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా​ పర్యటన.. షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

అరంగేట్ర మ్యాచ్​లో జైస్వాల్​ రికార్డు.. ఆ ప్లేయర్​కు చేరువలో విరాట్​..

Last Updated : Jul 15, 2023, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.