ETV Bharat / sitara

ప్రియాంకలో ఆ గుణమే నచ్చింది: కంగన

author img

By

Published : Oct 30, 2020, 12:22 PM IST

స్టార్​ నటి అనే భావన లేకుండా ప్రియాంకా చోప్రా ఓ మిత్రురాలిలా ప్రవర్తించిందని కంగనా రనౌత్​ కొనియాడింది. 2008లో విడుదలైన 'ఫ్యాషన్' సినిమాలో ప్రియాంక సహనటిగా చేసిన కంగనా.. ఇరువురి మధ్య జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకుంది.

Kangana_PC
ప్రియాంకలో ఆ గుణమే నచ్చింది: కంగనా రనౌత్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను కొనియాడి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది కంగనా రనౌత్. ప్రియాంకతో కలిసి 'ఫ్యాషన్'​ సినిమాలో నటించింది కంగన. 2008లో విడుదలైన ఈ సినిమా నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగనా రనౌత్​.. 'ఫ్యాషన్​' సినిమా షూటింగ్​ రోజులను గుర్తుచేసుకుంది.

Kangana_PC
'ఫ్యాషన్​' నటీమణులతో కంగనా

'ప్రియాంక గుణం గొప్పది'

'ఫ్యాషన్​' సినిమా కోసం ప్రియాంకతో కలిసి సహనటిగా పనిచేయడం చాలా గొప్ప విషయం అని పేర్కొంది కంగన. స్టార్​ నటి అనే భావన లేకుండా ప్రియాంక ఇతరులతో ప్రవర్తించే తీరు తనకు చాలా నచ్చిందని తెలిపింది. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రియాంకా చోప్రా సినిమాలు విపరీతంగా చూస్తుండేదానినని గుర్తుచేసుకుంది.

"ఫ్యాషన్' షూటింగ్​ సమయంలో ప్రియాంక నన్ను జూనియర్​లా భావించలేదు. ఆమె ఎప్పుడూ కూల్​గా ఉంటుంది. ఓ మంచి మిత్రురాలిలా ప్రవర్తించింది. ఆమెలో స్టార్​నటి అనే భావన ఎక్కడా కనిపించలేదు . ప్రియాంకలో ఆ గుణం ఉండడం చాలా గొప్ప విషయం."

-కంగనా రనౌత్, సినీనటి

ఈ సినిమాలో నటనకుగానూ ప్రియాంకా చోప్రాకు జాతీయ అవార్డు లభించింది. సహనటిగా చేసిన కంగనకూ జాతీయ అవార్డు రావడం విశేషం.

ఇదీ చదవండి:రీఎంట్రీపై సమీరా రెడ్డి ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.