ETV Bharat / sitara

నందమూరి యువ హీరోతో బాలకృష్ణ మల్టీస్టారర్!

author img

By

Published : May 5, 2021, 9:52 PM IST

యువ కథానాయకుడు కల్యాణ్​రామ్​తో కలిసి బాలకృష్ణ నటించనున్నారట. ప్రస్తుతం ఈ విషయమై తెగ వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వస్తేగాని దీనిపై ఏది చెప్పలేం.

Balakrishna in a multi starrer with kalyan ram
బాలకృష్ణ-కల్యాణ్​రామ్

నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం వరస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' చేస్తున్నారు. ఇది చివరిదశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే గోపీచంద్​ మలినేనితో పనిచేస్తారు. ఆ తర్వాత కల్యాణ్​రామ్​తో కలిసి మల్టీస్టారర్​ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nandamuri Balakrishna
అఖండ సినిమాలో బాలకృష్ణ

యువ దర్శకుడు అనిల్​ రావిపూడి, బాలకృష్ణతో సినిమా చేయనున్నారని చాలారోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'ఎఫ్3' బిజీగా ఉన్న ఆ డైరెక్టర్.. అది పూర్తి కాగానే మల్టీస్టారర్​ కోసం రంగంలోకి దిగుతారట. దీనికోసం హీరోలు ఇంకా అంగీకారం తెలపాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.