ETV Bharat / opinion

వర్చువల్‌ మీటింగ్‌కు సిద్ధమేనా?

author img

By

Published : May 18, 2021, 5:36 PM IST

ఆఫీసులో మీటింగ్‌ అనగానే ప్రొఫెషనల్‌ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా అందరూ ఇంటి నుంచే పని. దీంతో వర్చువల్‌ మీటింగ్‌లు తప్పనిసరి అవుతున్నాయి. మరి ఇక్కడా అదే తీరును కనబరుస్తున్నారా? చెక్‌ చేసుకోండి.

virtual meeting
virtual meeting

ఆఫీసులో ఎలాగైతే సమయానికి ముందుగానే సిద్ధంగా ఉంటారో.. ఇంట్లోనూ అలాగే ఉండేలా చూసుకోండి. ఇంటర్నెట్‌, ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ ఒక్కోసారి ఇబ్బంది పెట్టొచ్చు. వాటిని ముందుగానే చెక్‌ చేసుకోండి. వీటిపరంగా ఏదైనా సమస్య ఉంటే ముందుగానే తెలియజేయండి. అపుడు మీటింగ్‌ సమయాన్ని మార్చే వీలుంటుంది.
* ఆఫీసులో ఉండే నిశ్శబ్ద వాతావరణాన్ని ఇంట్లోనూ ఆశించలేం. ఇంట్లోవాళ్లు, బయటి శబ్దాలు.. వీటిని ఆపడం కష్టం. కుదిరితే వీటన్నింటికీ దూరంగా ఉండే గదిని ఎంచుకోండి. లేదా మీరు మాట్లాడేటపుడు మినహా మిగతా సమయాల్లో మ్యూట్‌లో ఉంచండి.
* ఇంట్లో సౌకర్యవంతమైన దుస్తులకే ఎక్కువమంది ప్రాధాన్యం. కానీ మీటింగ్‌ సమయంలోనూ అలాగే ఉంటామంటే కుదరదు. పనిపై సీరియస్‌గా లేరనే సందేశాన్నిచ్చిన వారవుతారు. కాబట్టి, దుస్తులు, కనిపించే తీరుపై దృష్టిపెట్టడం మర్చిపోవద్దు. పరిసరాలనూ గమనించుకోవాలి. చిందరవందరగా ఉన్న గది ఎదుటివారి దృష్టిని మరల్చొచ్చు. వీలైతే మీ వెనుక గోడ కనిపించేలా కూర్చుంటే మంచిది.
* కొవిడ్‌ తరువాత ఆహారం తినే వేళల్లో మార్పులొచ్చాయి. పని హడావుడిలో మర్చిపోతే మీటింగ్‌ పూర్తయ్యేంత వరకూ ఆగాల్సిందే. ఆఫీసులోనూ ఇదే పరిస్థితి ఎదురైతే బాక్స్‌ తీసుకుని హాజరవ్వరు కదా! ఇక్కడా అంతేనని గుర్తుంచుకోవాలి.

ఇదీ చూడండి: ఐదేళ్లు ఎదురుచూసి.. లక్ష్యాన్ని ముద్దాడి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.