ETV Bharat / lifestyle

చారన్నమే చాలంటూ చాలా సతాయిస్తున్నాడు!

author img

By

Published : Jun 13, 2020, 11:58 AM IST

మా బాబుకు తొమ్మిదేళ్లు. మాంసాహారం తినడు. గుడ్డు నచ్చదు. ఏది పెట్టిన వదిలిపెట్టేస్తుంటాడు. కేవలం చారు మాత్రమే కావాలంటూ దానితో తినేస్తాడు. ఇలా ఐతే వాడికి పోషకాలు అందేదెలా?

how-to-feed-children-with-nutrients
how-to-feed-children-with-nutrients

తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారులు 132- 145 సెం.మీ. ఎత్తు, 32 నుంచి 40 కిలోల దాకా బరువు ఉండొచ్ఛు చారు తినడం తప్పుకాదు. దాంతోపాటు అన్ని రకాల పదార్థాలు బాబు తినేలా చూసుకోవాలి. ప్రతీపూట అన్నమే కాకుండా.. చపాతీ, బ్రెడ్‌, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం ఏదైనా పెట్టొచ్ఛు ఇలాంటివి పెడితే సూక్ష్మపోషకాలు, పీచు సమృద్ధిగా అందుతాయి. మాంసాహారానికి బదులుగా ఉడకబెట్టిన సెనగలు, గుగ్గిళ్లు, వేయించిన/ఉడకపెట్టిన వేరుసెనగలు, పాలు, పెరుగు పెట్టొచ్ఛు బాదం, నువ్వులు.. లాంటివాటితో రకరకాల చిరుతిళ్లు చేసి తినిపించొచ్ఛు కూరగాయలను కూరగా మాత్రమే తీసుకోవాలని లేదు.

కీరాను చక్రాల్లా కోసి పెట్టొచ్ఛు క్యారెట్‌ను ఫ్రెంచ్‌ఫ్రైస్‌లా స్టిక్స్‌మాదిరి చక్కగా గార్నిష్‌ చేసి పెట్టొచ్ఛు క్యారెట్‌ను తురిమి పెరుగులో కలిపి రైతాలా అందివ్వొచ్ఛు కూరగాయలన్నింటిని కలిపి వెజిటబుల్‌ కట్‌లెట్‌లా చేసి పెట్టొచ్ఛు ఇంకా తినడం లేదు అనిపిస్తే విటమిన్‌-సి ఉండే పండ్లను పెట్టొచ్ఛు చిన్నారులు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉంటే తినడం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే.. తరచూ జబ్బు పడుతున్నప్పుడు, త్వరగా అలసిపోతున్నా... వారు తీసుకునే ఆహారం ఎంత మోతాదులో ఉందో గమనించండి. చిన్నారులకు తీసుకునే ఆహారం మోతాదు ఒక అంశమైతే... అందులో పోషకాలెన్ని ఉన్నాయన్నది మరో ప్రధాన అంశం.

ఇవీ చూడండి: శిల్పాశెట్టిని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన వార్నర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.