ETV Bharat / international

గనిలో కుప్పకూలిన ఎలివేటర్​- 11మంది కూలీలు దుర్మరణం, మరో 75మందికి గాయాలు

author img

By PTI

Published : Nov 29, 2023, 7:31 AM IST

Updated : Nov 29, 2023, 10:57 AM IST

South Africa Mine Accident : ఓ గని వద్ద ఎలివేటర్ కూలిన ప్రమాదంలో 11 మంది కూలీలు మరణించారు. మరో 75 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.

South Africa Mine Accident
South Africa Mine Accident

South Africa Mine Accident : దక్షిణాఫ్రికా.. రస్టెన్​బర్గ్​లోని ఓ గని వద్ద ఎలివేటర్ కూలిన ఘటనలో 11 మంది కూలీలు మరణించారు. మరో 75 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 200 మీటర్ల ఎత్తు నుంచి ఎలివేటర్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కార్మికుల డ్యూటీ నుంచి తిరిగివస్తుండగా జరిగిందీ ప్రమాదం.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాటినం గనిలో పనిచేసే కార్మికులు ఎలివేటర్​లో ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఎలివేటర్ పైనుంచి కిందకి జారిపోయింది. ఈ క్రమంలో 11 మంది మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 86 మంది కార్మికులు ఆసమయంలో ఎలివేటర్​లో ఉన్నారు.

ఈ దుర్ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా దక్షిణాఫ్రికా ఎనర్జీ అండ్ మైన్స్ మినిస్టర్ గ్విడే మంటాసే ఆదేశించారు. 'ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ చరిత్రలో ఇది చీకటిరోజు. ప్రమాదానికి కారణాలు ఏంటి? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం గనిలో పనులు జరగకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశాం.' అని ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ సీఈఓ నికో ముల్లర్ తెలిపారు.

గోల్డ్​మైన్​లో అగ్ని ప్రమాదం..
కొన్నాళ్ల క్రితం పెరూలోని ఓ గోల్డ్​మైన్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నైట్​ షిఫ్ట్​ పనుల్లో నిమగ్నమై ఉండగా గనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దక్షిణ పెరులోని యానాకిహువా మైనింగ్​ కంపెనీకి చెందిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టి.. మొత్తం 175 మంది కార్మికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. షార్ట్​​ సర్కూట్​ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్​పై క్లిక్ చేయండి.

బొగ్గు గనిలో భారీ పేలుడు..

కొన్నాళ్ల క్రితం ఇండోనేసియాలోని సుమత్రా ప్రావిన్స్​లో ఉన్న ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇద్దరిని రక్షించి.. తక్షణ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. మైనింగ్​ జరుపుతుండగా మీథేన్ వాయువు పెద్దమొత్తంలో విడుదల అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

నేపాల్‌లో తరచూ 'విమాన' ప్రమాదాలు ఎందుకు? కారణాలవేనా!

విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఫ్లైట్​లో 140 మంది ప్రయాణికులు.. లక్కీగా..

Last Updated : Nov 29, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.