ETV Bharat / international

కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు- 19 మంది దుర్మరణం

author img

By

Published : Nov 7, 2021, 7:22 AM IST

Updated : Nov 7, 2021, 10:25 AM IST

టోల్​బూత్​ వద్ద ఆగి ఉన్న కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. మెక్సికోలో ఈ ప్రమాదం(Mexico Accident) జరిగింది.

mexico accident
మెక్సికోలో ప్రమాదం

కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు

మెక్సికోలో(Mexico Accident) ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై టోల్​బూత్​(Toll Booth Accident) వద్ద ఆగి ఉన్న 9 కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

గ్లూను తరలిస్తున్న ఓ ట్రక్కు.. టోల్​బూత్​​(Toll Booth Accident) వద్ద బ్రేకులు ఫెయిల్​ అవ్వగా ఈ ప్రమాదం జరిగిందని మెక్సికో అగ్నిమాపక శాఖ అధికారి ఆర్డియన్​ డియాజ్​ చావెజ్​ తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ ప్రమాదానికి(Mexico Accident) సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో వాహనాలకు పెద్దఎత్తున మంటలు వ్యాపించినట్లుగా కనిపించాయి.

ఇదీ చూడండి: హైస్పీడ్​ రైలులో కత్తితో దాడి

Last Updated : Nov 7, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.