ETV Bharat / headlines

Sonu sood: తెలుగు రాష్ట్రాలకు సోనూసూద్ మరో సాయం

author img

By

Published : May 31, 2021, 4:44 PM IST

కరోనా కష్టకాలంలో అడిగిందే తడవుగా సహాయం అందించే సోనుసూద్(Sonu sood) మరో కొత్త కార్యక్రమం తలపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఫ్రీజర్ బాక్సులను(శవపేటికలను) పంపించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల సర్పంచుల విజ్ఞప్తుల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లాలోని కొన్ని గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులను పంపిస్తానని సోనుసూద్(Sonu sood) హామీ ఇచ్చారు.

sonu sood
sonu sood

అడిగిందే తడవుగా నిస్సహాయులకు చేయూతనిస్తున్న ప్రముఖ సినీనటుడు సోనూసూద్ (Sonu sood) మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చనిపోయిన వారి మృతదేహాలను పెట్టడానికి శవపేటికలను పంపించేందుకు సిద్ధమయ్యారు.

తెలుగు రాష్ట్రాల సర్పంచుల విజ్ఞప్తులు:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల సర్పంచులు సోనూసూద్ కు అభ్యర్థనలను పంపారు. ఫ్రీజర్ బాక్సులు దొరకక మృతదేహాలు కుల్లిపోతున్నాయని, నా అనుకున్న వాళ్లు చివరి చూపునకు దూరమవుతున్నారని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పరిస్థితుల్లో సమీప నగరాల నుంచి ఫ్రీజర్ బాక్సులు తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, ఫ్రీజర్ బాక్సులకు సహాయం చేయాలని సోనుసూద్ కు వివరించారు.

స్పందించిన సోనూసూద్...

జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం అవుషాపూర్, వనపర్తి జిల్లా కొత్తపేట మండలం సంకిరెడ్డిపల్లి, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తోగలగల్లు, మద్దికెర మండలం మద్దికెర, ఓర్వకల్లు గ్రామాలకు సాధ్యమైనంత త్వరగా ఫ్రీజర్ బాక్సులను పంపించనున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులకు హామీ ఇచ్చారు. ఫ్రీజర్ బాక్సుల విజ్ఞప్తులపై తక్షణమే స్పందించిన సోనూకు ఆయా గ్రామాల సర్పంచులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: Curfew: రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.