ETV Bharat / entertainment

'ప్రభాస్ పెళ్లి ఎప్పుడైతే నా మ్యారేజ్ అప్పుడే'

author img

By

Published : Dec 13, 2022, 9:39 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరో ప్రభాస్​ పెళ్లి గురించి తమిళ్​ హీరో విశాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాల్ ఏమన్నారంటే..?

vishal marriage
హీరో విశాల్​

Vishal Marriage : ప్రస్తుతం కొంత మంది హీరోల పెళ్లిళ్ల గురించి సోషల్​ మీడియాలో ఫుల్​టాక్​ నడుస్తోంది. అందులో ముఖ్యంగా తమిళ్​ హీరో విశాల్​ పెళ్లి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. నటి అభినయని వివాహం చేసుకోనున్నారని, త్వరలోనే అభిమానులకు తీపి కబురు చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా విశాల్ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు, పాన్​ఇండియా హీరో రెబల్​ స్టార్​ ప్రభాస్​ పెళ్లి గురించి మాట్లాడారు విశాల్​. రీసెంట్​గా బాలీవుడ్​ భామ కృతి సనన్​తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవేవి నిజం కాదని, కేవలం రూమర్స్​ మాత్రమేనని కృతి చెప్పడం వల్ల అంతా దాని గురించి పట్టించుకోవడం మానేశారు. తాజాగా ప్రభాస్ పెళ్లితో తన పెళ్లి గురించి లింక్ చేస్తూ హీరో విశాల్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

విశాల్ పోలీస్ కానిస్టేబుల్​గా నటించిన సినిమా 'లాఠీ'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్​కు విశాల్ హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే ఓ విలేకర్​.. హీరో విశాల్​కు 'మీ పెళ్లెప్పుడు?' అని అడిగారు. దీనికి స్పందించిన విశాల్.. 'కెరీర్​పరంగా చాలా బాధ్యతలు నాపై ఉన్నాయి. పెళ్లనేది జోక్ కాదు కదా. నాకైతే ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే రాలేదు. అలానే ప్రభాస్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో నేను అప్పుడే చేసుకుంటా' అని నవ్వుతూ బదులిచ్చారు. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తోన్న 'అన్​స్టాపబుల్​ 2' షోలో కూడా శర్వానంద్, అడివి శేష్.. పెళ్లి గురించి ప్రశ్న అడిగినప్పుడు.. వాళ్లు కూడా ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు విశాల్ కూడా ఇలానే చెప్పి ఆశ్చర్యపరుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.