ETV Bharat / entertainment

'నేను ఆ హీరోల్లాగా ఫిట్‌గా ఉండకపోవచ్చు కానీ'..

author img

By

Published : Dec 21, 2022, 9:24 PM IST

పఠాన్‌ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షారుక్‌.. తాను నటించిన జీరో సినిమాపై ఆసక్తికర కామెంట్స్​ చేశారు.

sharukh khan
sharukh khan

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ ప్రస్తుతం పఠాన్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. వివిధ వేదికలపై ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షారుక్‌.. తను ఈ యాక్షన్‌ సినిమాలో నటించడానికి ఎలా అంగీకరించాడో తెలిపారు.

"నాలుగు సంవత్సరాల క్రితం నేను నటించిన 'జీరో' సినిమా బాక్సాఫీసు వద్ద అలరించలేకపోయినప్పుడు ఈ సారి కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నా. ఇప్పుడు ఉన్నంత బలంగా అప్పుడు లేను. నా శరీరంపై గాయాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. ఈసారి సినిమాకు నేను చాలా ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. నా స్నేహితులు ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్‌ ఆనంద్‌లు నా దగ్గరకు వచ్చి యాక్షన్‌ సినిమా చేయాలని కోరారు. 'నేను టైగర్‌ ష్రాఫ్‌, హృతిక్‌రోషన్‌ లాగా శారీరకంగా దృఢంగా లేకపోవచ్చు. అయినా నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పా. అందుకే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను' అని షారుక్‌ చెప్పారు.

ఇక 2018లో విడుదలైన 'జీరో' తర్వాత షారుక్‌ నటించిన చిత్రం పఠాన్‌. సుదీర్ఘ విరామం తర్వాత షారుక్‌ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహాం, డింపుల్‌ కపాడియా తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2023 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.