ETV Bharat / entertainment

ఆడియెన్స్​కు బంపర్ ఆఫర్​.. ఆ సినిమా చూస్తే లక్ష రూపాయలు.. కానీ!

author img

By

Published : Jan 2, 2023, 4:01 PM IST

ఓ మూవీటీమ్​ బంపర్​ ఆఫర్​ను ప్రకటించింది. తమ సినిమాను థియేటర్​కు వెళ్లి చూస్తే లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. దీనికి ఓ కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

rajayogam movie Audience  1Lakh
ఆడియెన్స్​కు బంపర్ ఆఫర్​.. ఆ సినిమా చూస్తే లక్ష రూపాయలు.. కానీ..!

తమ సినిమాను ప్రమోట్​ చేయడానికి మూవీటీమ్స్​ పలు రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతుంటాయి. ప్రజల్లోకి తీసుకెళ్లడానికి డిఫరెంట్​గా ప్లాన్​ చేస్తుంటాయి. తాజాగా ఓ సినిమా టీమ్​ కూడా అదే చేసింది. ప్రేక్షకులకు బంపర్​ ఆఫర్​ను ప్రకటించింది. తమ సినిమా చూసిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఓ కండీషన్‌ పెట్టింది. అదేంటంటే.. సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా రాజయోగం. కొత్త దర్శకుడు రామ్ గణపతి దీన్ని రూపొందించారు.

గతేడాది డిసెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది. దీంతో ఓ ప్రెస్​మీట్​ నిర్వహించిన మూవీటీమ్​.. ఆడియెన్స్​ ఈ సినిమాను బాగా అస్వాదిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకేళ్లందుకు ఓ సూపర్​ ఆఫర్​ను ప్రకటించింది. సినిమా చూసిన వారికి లక్ష రూపాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఓ షరతు పెట్టింది. సినిమా చూసి నవ్వకుండా ఉంటే ఈ నగదు బహుమతిని ఇస్తానని తెలిపింది.

ఈ ప్రెస్​ మీట్​లో దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ.. "మా సినిమాకి మంచి ఆదరణ వస్తోంది. సినిమా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. బాగా తీశారని అభినందిస్తున్నారు. సినిమా చూడని వాళ్ళు ఉంటే థియటర్​కు వెళ్లి చూడండి. అలాగే సినిమా చూసి నవ్వకుండా ఉంటే.. వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం" అని ప్రకటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: నైట్​ పార్టీలో బాయ్​ఫ్రెండ్​తో​ కలిసి స్టార్​ హీరో కూతురు చిల్​.. అలాంటి పోజులు ఇస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.