ETV Bharat / entertainment

కల్యాణ్ రామ్ 'అమిగోస్​' బిజినెస్​.. వరల్డ్​ వైడ్​గా ఎన్ని థియేటర్స్​లో రానుందంటే?

author img

By

Published : Feb 9, 2023, 12:41 PM IST

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్‌ మరో రోజు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్​ కానుంది? ఎంత ప్రీ రిలీజ్​ బిజినెస్ చేసింది? ఆ వివరాలు..

Kalyan Ram Amigos Worldwide theatres
కల్యాణ్ రామ్ 'అమిగోస్​' బిజినెస్​

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్‌. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథగా రూపొందిన చిత్రమిది. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా వ్యవహించారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 742కు పైగా థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలుస్తోంది. నైజాంలో 152, సీడెడ్​లో 60, ఆంధ్రలో 210కు పైగా హాళ్లలో సందడి చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణాలో 425కు పైగా థియేట్లరలో ప్రేక్షకులను అలరించనున్నాయి సినీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60కు స్ర్రీన్లలో ఓవర్సీస్​లో 260కుపైగా హాళ్లలో సందడి చేయనున్నట్లు లెక్క తెలుస్తోంది. అలా మొత్తంగా వరల్డ్​వైడ్​గా 742కు పైగా సంఖ్య ఉంటుందని సమాచారం. ఇంకా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.30కోట్లకు పైగా బిజినెస్​ అయిందట. అంటే ఈ మూవీ బ్రేక్​ ఈవెన్​ రూ.12కోట్లు అన మాట.

కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్​లో రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ కలిపి రూ. 9.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 1.40 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 11.30 కోట్లు బిజినెస్ అయినట్లు అర్థమవుతోంది.దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది.

కాగా, బింబిసార లాంటి హిట్​ తర్వాత కల్యాణ్‌ రామ్‌ ఈ అమిగోస్‌ చిత్రం చేయడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి గాని పాటను రీమిక్స్‌ చేయడం విశేషం. ఈ పాటను ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్తంగా ఆలపించారు. ఇప్పుడీ గీతాన్ని జిబ్రాన్‌ సరికొత్తగా రీమిక్స్‌ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. కల్యాణ్‌రామ్‌ ఇందులో మంజునాథ్‌, సిద్ధార్థ్‌, మైఖేల్‌ అనే మూడు పాత్రల్లో సందడి చేశారు. వీటిలో మైఖేల్‌ పాత్రను ప్రతినాయక ఛాయలున్న పాత్రలా ప్రచార చిత్రంలో చూపించారు. అందులో కల్యాణ్‌రామ్‌ ఆహార్యం.. ఆయన పలికించిన హావభావాలు, చేసిన యాక్షన్‌ హంగామా ఆసక్తి రేకెత్తించాయి.

ఇదీ చూడండి: Amigos: NTR ఫ్యామిలీ హీరోస్​ రీమిక్స్​ సాంగ్స్​ విన్నారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.