ETV Bharat / entertainment

కళ్లు చెదిరే సీన్స్​తో 'ఫాస్ట్​ ఎక్స్'​ ట్రైలర్​.. ఒకేసారి 20కుపైగా కార్లు గాల్లోకే..

author img

By

Published : Feb 11, 2023, 8:09 AM IST

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్​లో భాగంగా 'ఫాస్ట్ ఎక్స్​' చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం కళ్లు చెదిరో సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Fast and furious Series 10th part Fast X new trailer released
కళ్లు చెదిరే సీన్స్​తో 'ఫాస్ట్​ ఎక్స్'​ ట్రైలర్​

ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్​కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా విన్‌ డీజిల్‌ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా పదో పార్ట్​గా రానున్న 'ఫాస్ట్ ఎక్స్​' చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో కొన్ని ఎఫ్‌ అండ్‌ ఎఫ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన జస్టిన్‌ లిన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని చిత్రాల్లోలానే ఈ మూవీలో కూడా కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవి సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచాయి. ఈ సిరీస్‌కు సంబంధించి తర్వాతి వచ్చే చిత్రమే ఆఖరిదని తెలుస్తోంది. ఈ ఫాస్ట్​ ఎక్స్​ మే 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమాలో మరో విలన్‌గా ఆక్వామ్యాన్ ఫేమ్ జేసన్ మోమోవా కనిపించనున్నాడు. అలాగే కెప్టెన్ మార్వెల్ ఫేమ్​ బ్రీ లార్సెన్ కూడా ఈ సినిమాలో నటించింది. అయితే ఏడో భాగం షూటింగ్ తర్వాత యాక్సిడెంట్​లో చనిపోయిన స్టార్ యాక్టర్​ పాల్ వాకర్‌ను కూడా ఈ మూవీలో చూపించనున్నడం విశేషం.

ఇకపోతే ఈ చిత్రంలో బ్రీ లార్సెన్, జాసన్ స్టాటమ్, జేసన్ మోమోవాతో పాటు విన్ డీజిల్, మిషెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్ బ్రిడ్జెస్, నథానీ ఇమ్మాన్యుయెల్, జోర్డానా బ్రూస్టర్, జాన్ సేనా, సుంగ్ కాంగ్, అలన్ రిచ్‌సన్, డేనియలా మెల్‌కోయిర్, స్కాట్ ఈస్ట్‌వుడ్, హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరాన్, గాల్ గాడోట్ ఇందులో నటించనున్నారు. ఇక 11వ భాగాన్ని మరింత భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారట. ఐరన్ మ్యాన్ పాత్రలో కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ హీరోలు ఒరిజినల్ గ్యాంగ్​స్టర్స్​.. ఇక బొమ్మ బ్లాక్‌బస్టరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.