ETV Bharat / entertainment

గంగమ్మ తల్లి గెటప్‌లో 'పుష్ప'రాజ్‌.. అందుకేనా?

author img

By

Published : Apr 8, 2023, 2:28 PM IST

పుష్ప టీజర్​లో శ్రీవల్లి గురించి అస్సలు చూపించలేదు. అయితే అల్లు అర్జున్​ మాత్రం గంగమ్మ తల్లి రూపంలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే రూపం ధరించడానికి కారణం శ్రీవల్లినేనట. దానికి సంబంధించి పూర్తి వివరాలే ఈ కథనం..

Srivalli
గంగమ్మ తల్లి గెటప్‌లో 'పుష్ప'రాజ్‌.. అందుకేనా?

సినీ ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే 'పుష్ప 2' టీజర్. ​శుక్రవారం విడుదలైన ఈ టీజర్‌ సోషల్​ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్​లో రిలీజైన ఈ టీజర్​ వ్యూస్​లో రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలైన 18 గంటల్లోనే దాదాపు 21 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ ఒక్క విషయం చాలు పాన్​ ఇండియా లెవెల్​లో పుష్పకున్న క్రేజ్​ను తెలుసుకునేందుకు. ఇక టీజర్ చూస్తుంటే.. సినిమా మొదటి భాగం కంటే ఈ సెకెండ్​ పార్ట్​ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. మొత్తంగా ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లోగో.. ఇలా ప్రతీ అంశం సినిమాపై అంతకుమించి అంచనాలను పెంచేసింది. పుష్ప ​ ఎక్కడ ఉన్నాడంటూ అనే పాయింట్​తోనే సాగింది. చివర్లో నైట్​ విజన్​లో పుష్ప అడవిలో ఉన్నాడంటూ చూపించే పులి సీన్‌ అయితే టీజర్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. అలా ఫ్యాన్స్​ అంచనాలకు తగ్గట్టుగా టీజర్​ను రూపొందించారు.

ఈ నేపథ్యంలోనే ఈ పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్​ మీడియాలో వైరలవుతోంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ పుష్ప సినిమా టీజర్‌లో కేవలం గొడవలు, పుష్ప మాస్‌ ఎంట్రీ మాత్రమే ఉంది. దాన్ని చూస్తుంటే పోలీసుల చెర నుంచి తప్పించుకున్న పుష్పరాజ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తిరిగి వస్తాడన్న సంగతి తెలుస్తోంది. అయితే ఎక్కడా హీరోయిన్‌ శ్రీ వల్లి ప్రస్తావన రాలేదు. ఆమెకు సంబంధించి కనీసం ఒక్క సన్నివేశం కూడా చూపించలేదు. ఇకపోతే గతంలో సెకండ్​ పార్ట్​లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని, ఇక ఉండదని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సీక్వెల్​లో రష్మిక పాత్రను కాసేపు చూపించి తర్వాత చచ్చిపోయేలా చూపిస్తారని అంటున్నారు. అలా శ్రీవల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం చుట్టే సెకండ్‌ హాఫ్‌ నడుస్తుందని నెటిజన్లు ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారు.

ఈ చిత్రంలో 'పుష్ప' శుత్రువులైన జాలి రెడ్డి, ఎస్పీ షకావత్‌, మంగళం శీను.. పుష్పరాజ్‌ను ఏమీ చేయలేక.. అతడిపై కక్ష తీర్చుకోవటాని శ్రీవల్లిని చంపేస్తారని నెటిజన్లు భావిస్తున్నారు. పుష్ప మిత్రుడైన కేశవను కూడా చంపేస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకే పుష్పరాజ్‌ గంగమ్మ అవతారం ఎత్తి.. అర్థనాధీశ్వరుడి రూపంలో విలన్లతో ఫైట్ చేస్తాడట. మరి సోషల్‌ మీడియలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హాట్​ టాపిక్​గా 'పుష్ప' గోరు సస్పెన్స్​.. దీని వెనక ఉన్న కథ ఇదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.