ETV Bharat / entertainment

అల్లరి నరేశ్​ 'ఉగ్రం'.. గోపీచంద్​ 'రామబాణం' ఎలా ఉన్నాయంటే ?

author img

By

Published : May 5, 2023, 9:49 AM IST

థియేటర్లలో సందడి చేసేందుకు శుక్రవారం సినిమాలు వచ్చేశాయి. అల్లరి నరేశ్​ 'ఉగ్రం'తో పాటు గోపీచంద్​ నటించిన రామబాణం విడులయ్యాయి. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​కు వెళ్లిన ఆడియన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే ?

ugram and ramabanam twitter review
ugram and ramabanam

'నాంది' స‌క్సెస్​ను ఆస్వాదిస్తున్న టాలీవుడ్​ స్టార్ హీరో అల్లరి నరేశ్​ మరోసారి అదే దర్శకుడితో ఓ సాలిడ్ సినిమాను ప్లాన్​ చేశారు. అలా అల్ల‌రి న‌రేశ్- విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఉగ్రం'. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ప్రీమియర్​ షోలు చూసిన అభిమానులు.. ట్విట్టర్​ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్​తో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ అందుకుంటోంది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఓ సీరియస్​ పోలీస్ ఆఫీస‌ర్‌ అవతారంలో అల్ల‌రి న‌రేశ్ క‌నిపించ‌డ వల్ల ఆడియన్స్‌లో మరింత ఆస‌క్తి రేగింది. ఈ క్రమంలో సినిమాకు అభిమానుల నుంచి పాజిటివ్​ టాక్​ వస్తోంది. ఇందులో అల్లరి నరేష్ తన యాక్టింగ్​తో అదరగొట్టేశాడని.. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​, కెమెరా విజువల్స్ లాంటి అంశాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మిక్డ్స్ ఎమోషన్లతో ఉందని టాక్​.

  • After #Dasara Marana mass fights in #Ugram are Spell bound though some flashback love scenes are predictable people can feel lag in love scenes and killing performances by @allarinaresh anna and @mirnaaofficial are lit🔥 Massy 2nd half needed to be a hit 💰 1st half⭐3.5/5⭐

    — Movie Buff (@UnitedTwood2108) May 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరవాత నుంచి ట్రాక్ ఎక్కుతుందని.. అయితే లవ్ సీన్స్​తో పాటు కొన్ని సన్నివేశాలు కొన్ని చోట్ల సాగదీతగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుందని కొందరు అంటున్నారు. కానీ ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్​ బాగుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిందనే అంటున్నారు.

గోపీచంద్​ రామబాణం ఎలా ఉందంటే..
ఇక టాలీవుడ్​ మాచో హీరో గోపీచంద్​ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ రామబాణం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్​ నిర్మించిన ఈ సినిమా కూడా శుక్రవారమే రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్​ షోలు వీక్షించిన ఫ్యాన్స్​ ట్విట్టర్​లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు కూడా అభిమానుల్లో నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్​గా కుదిరాయని.. అంతే కాకుండా సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్​ ఈ సినిమాకు బాగా కనెక్ట్​ అవుతారని అంటున్నారు.

మరోవైపు ఈ సినిమా.. యాక్షన్ సీక్వెన్స్​తో అదిరిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగపతి బాబు, గోపీచంద్ మధ్య బ్రదర్​ సెంటిమెంట్​ బాగా వర్కౌట్​ అయ్యిందని టాక్​. ఇక అన్నావదినల కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ఓ కంప్లీట్​ ఫ్యామిలీ ఎంటర్టైనర్​ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.