ETV Bharat / entertainment

గుండెపోటా? జ్వరమా? చియాన్​ విక్రమ్​ హెల్త్​పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు

author img

By

Published : Jul 8, 2022, 6:29 PM IST

Updated : Jul 8, 2022, 6:36 PM IST

ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. విక్రమ్​కు గుండెపోటు వచ్చిందని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇంతకీ ఏమైంది? కావేరి ఆస్పత్రి వైద్యుల మాటేంటి?

vikram heart attack
vikram heart attack

ప్రముఖ నటుడు చియాన్​ విక్రమ్​కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్​కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు విక్రమ్​ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు కావేరి ఆస్పత్రి సహవ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్.

vikram heart attack
మెడికల్ బులెటిన్​


ఆ వార్తలన్నీ అసత్యం!: విక్రమ్​ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. "విక్రమ్​కు ఛాతిలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవం. ఈ వదంతులు వినడం చాలా బాధ కలిగించింది. విక్రమ్ బాగున్నారు. ఒక రోజులో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది" అని అన్నారు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్.

మరోవైపు... విక్రమ్​ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. విక్రమ్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
'అపరిచితుడు' చిత్రంతో విక్రమ్‌ తెలుగువారికి ఎంతో చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలై ఇక్కడి వారిని అలరించాయి. ప్రస్తుతం ఆయన 'కోబ్రా', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: హీరో చియాన్​ విక్రమ్​కు గుండెపోటు!

Last Updated : Jul 8, 2022, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.