ETV Bharat / entertainment

'ఆచార్య' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా అభిమానుల రచ్చ

author img

By

Published : Apr 12, 2022, 5:55 PM IST

Updated : Apr 12, 2022, 10:46 PM IST

Acharya Trailer: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్​ వచ్చేసింది. తొలుత ట్రైలర్​ను థియేటర్లలో విడుదల చేయగా.. అభిమానులు పండగ చేసుకున్నారు. యూట్యూబ్​లోనూ వచ్చేసిన ఈ ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

acharya
ఆచార్య

Acharya Trailer: మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్​ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం 5.49కి థియేటర్లలో విడుదలైంది. దాదాపుగా 152 థియేటర్లలో 'ఆచార్య' మూవీ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అదిరిపోగా.. థియేటర్లలో మెగా అభిమానులు సందడి చేశారు.

అయితే ట్రైలర్​ను వీక్షించేందుకు మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లారు. ట్రైలర్​లో చిరంజీవి చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలను చూసి తెగ సంబరపడిపోతున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో పెన్‌ స్టూడియోస్‌ ఆధ్వర్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హిందీ ట్రైలర్‌ కూడా విడుదల అవుతుందా? లేదా అన్న సందిగ్ధత నెలకొంది. చిత్ర బృందం సైతం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం వల్ల ఎప్పుడు విడుదల చేస్తారన్న ఆసక్తి మొదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కేజీయఫ్​కు వచ్చిన డబ్బులన్నీ వాళ్లకే ఇస్తా: ప్రశాంత్​నీల్​

Last Updated :Apr 12, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.