ETV Bharat / crime

Online gaming: యువకుడి ఉసురు తీసిన.. ఆన్​ లైన్​ గేమ్​..

author img

By

Published : Oct 14, 2021, 11:15 AM IST

ఆన్ లైన్ గేమ్స్ యువత పాలిట యమగండాలుగా మారుతున్నాయి. వీటికి ఆకర్షితులై యవత లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే.. విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది.

Online gaming
Online gaming

విజయనగరం జిల్లా సాలూరు పెద్ద కుమ్మరి వీధి చెందిన గులిపల్లి కేశవ శ్రీనివాస్ (20) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్​ బీటెక్​ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్​లైన్​ గేమ్స్​కు బాసినై.. సుమారు రూ.60 వేలు నష్టపోయాడు. ఓడిపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక.. ఇంట్లో వారికి చెప్పలేక ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి:

Power Crisis: విద్యుత్‌ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.