ETV Bharat / crime

Acid Attack: మాంసం విషయంలో గొడవ.. చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి

author img

By

Published : Apr 1, 2022, 9:29 AM IST

Acid Attack in Vemulawada: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పపూర్‌లో దారుణం జరిగింది. చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

vendors acid attack on chicken center owners
మాంసం విషయంలో గొడవ.. చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి

Acid Attack in Vemulawada: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పపూర్‌లో దారుణం జరిగింది. చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడి చేసుకున్నాయి. చికెన్ సెంటర్ నిర్వాహకులు 10 మందిపై చిరువ్యాపారులు దాడి చేశారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.