ETV Bharat / crime

చౌడేశ్వరి దేవాలయంలో చోరీ.. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు

author img

By

Published : Jul 10, 2022, 10:36 AM IST

THEFT: రాష్ట్రంలో దారి దోపిడీలు, ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో గొలుసులు, ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బులు అపహరణ లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దొంగ గుడిలో దొంగతనం చేశాడు. దేవాలయం వెనుక ఉన్న కొండపై నుంచి గుడిలోకి ప్రవేశించి చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

THEFT
చౌడేశ్వరి దేవాలయంలో చోరీ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

చౌడేశ్వరి దేవాలయంలో చోరీ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

THEFT IN TEMPLE: అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరి దేవాలయంలో చోరీ జరిగింది. గర్భగుడి తాళాలు పగలగొట్టిన దొంగ.. అమ్మవారి 12.5 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొండపై నుంచి గుడిలోకి ప్రవేశించిన దొంగ.. తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడటం సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఆలయ అర్చకుడు దొంగతనంపై ధర్మకర్తకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్‌ టీంతో దొంగ వేలిముద్రలను సేకరించారు. ఏడున్నర లక్షల రూపాయల విలువైన అమ్మవారి కిరీటం, చేతులు.. ఇతర వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.