ETV Bharat / crime

క్రేజీ దొంగ: 'ఫోన్​ పాస్​వర్డ్​ చెప్పు గేమ్​ ఆడుకుంటా.. ఛార్జింగ్​ అయిపోయాక తెచ్చిస్తా'

author img

By

Published : Aug 20, 2021, 11:23 AM IST

గంపెడు ఆశలతో ఓ ఇంట్లో దొంగతనానికి దిగిన వారికి నిరాశ ఎదురైంది. సరే వచ్చాం కదా ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఆ ఇంట్లో ఉన్న సెల్​ఫోన్​లు తీసుకెళ్లారు. తెల్లవారాక ఇంట్లో చరవాణులు కనిపించపోయే సరికి తన సెల్​ఫోన్​కు కాల్​​​ చేశాడు యజమాని. అంతే.. ఆ దొంగ ఇచ్చిన షాక్​కు మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ దొంగ ఏమన్నాడో మీరే చూడండి.

thief-crazy
thief-crazy

హైదరాబాద్ పటాన్​చెరు ఠాణా పరిధిలోని శాంతినగర్‌ కాలనీలో బాలకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి బాలకృష్ణ ఇంటి తలుపునకు గడియపెట్టకుండా పడుకున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దొంగలు తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇద్దరు లోపలికి ప్రవేశించి ఆ ఇంట్లో కలియ తిరిగారు. కోటి ఆశలతో లోపలికి వచ్చిన వారికి 4 చరవాణులు తప్ప ఏవీ దొరకలేదు. దీంతో అవి తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు.

తెల్లవారాక ఇంట్లో చరవాణులు కన్పించకపోవడంతో బాలకృష్ణ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు దొంగలు ఇంట్లో తిరుగుతున్నట్లు ఫుటేజీలో గుర్తించారు. వెంటనే దొంగిలించిన చరవాణికి ఫోన్‌ చేయగా ఓ అపరిచిత వ్యక్తి లేపాడు.

"మీ ఇంట్లో ఏదో బంగారం ఉంటాది అనుకుని లోపలికి వచ్చాము. బంగారం లేదు, డబ్బు దొరకలేదు. సరే ఎలాగూ వచ్చాము కదా అని అక్కడున్న ఫోన్లు తీసుకెళ్లాము. సరే జరిగిందేదో జరిగిపోయింది. నాకు బోర్​ కొడుతుంది. నీ ఫోన్​ పాస్​వర్డ్​ చెప్పు గేమ్​ ఆడుకుంటా. ఛార్జింగ్​ అయిపోయిన వెంటనే... పటాన్​ చెరు తీసుకువచ్చి నీ ఫోన్​ నీకు ఇచ్చేస్తా'' అనే సమాధానం రావడంతో బాధితుడు అవాక్కయ్యాడు.

చేసేదేమి లేక ఆన్​లైన్​లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి: varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.