ETV Bharat / crime

హత్యలు, కిడ్నాప్‌లు చేస్తున్న హంతక ముఠా అరెస్టు..

author img

By

Published : Jul 25, 2022, 10:25 AM IST

Updated : Jul 25, 2022, 12:15 PM IST

Arrest: తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక పిస్తోలు, 16 తూటాలు, 3 వాహనాలతోపాటు రూ.6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

interstate murder and kidnapping gang arrested
అంతర్రాష్ట్ర హంతక ముఠా అరెస్టు

Arrest: తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సుంకర ప్రసాద్‌ నాయుడు ముఠాను అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న ప్రసాద్‌ నాయుడితోపాటు 13 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్తోలు, 16 తూటాలు, 3 వాహనాలతోపాటు రూ.6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్‌ను డబ్బు కోసం ఈ నెల 20న ఈ ముఠా కిడ్నాప్‌ చేసింది. నంద్యాల జిల్లా డోన్‌ సమీపంలోని ఓబుళాపురం పైమిట్టపై దాచిపెట్టి, రూ.కోటి ఇవ్వకపోతే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించారు. వారు పోలీసులకు ఆశ్రయించడంతో.. కిడ్నాపర్ల కోసం ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఆదివారం పక్కా సమాచారంతో పోలీసులు డోన్‌ సమీపంలోని ఓబుళాపురం పైమిట్టపై కిడ్నాపర్ల ముఠాను పట్టుకున్నట్లు.. కేసు వివరాలను ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.

అరెస్టయిన నిందితులు వీరే..
సుంకర ప్రసాద్‌నాయుడు (ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం హైదరాబాద్‌), తమ్మినేని మోహన్‌నాయుడు (జి.కొట్టాల, గుంతకల్లు), ఇల్లందుల రంజిత్‌ (జనగామ జిల్లా, తెలంగాణ), సైబా భాస్కర్‌ (మహబూబ్‌నగర్‌), కసుముర్తి విజయభాస్కర్‌ (జి.కొట్టాల, గుంతకల్లు), కుంకుమ మధు (జి.కొట్టాల), రమణయ్య (కర్నూలు.. ప్రస్తుతం గుంతకల్లు), బోనాల వెంకటేష్‌ (గుంతకల్లు), పులి రామాంజనేయులు (గుంతకల్లు), పసునూరి అనిల్‌ కుమార్‌ (వరంగల్‌, తెలంగాణ), ప్రేమ్‌ కమల్‌ (సూర్యాపేట, తెలంగాణ), పప్పుసింగ్‌ (హైదరాబాద్‌), చుక్క వెంకటేష్‌ (వనపర్తి, తెలంగాణ).

ఇవీ చూడండి:

Last Updated : Jul 25, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.