ETV Bharat / crime

Gas Cylinder leakage in Bachupally: గ్యాస్​ సిలిండర్​ లీక్​... నలుగురికి గాయాలు

author img

By

Published : Jan 3, 2022, 8:43 AM IST

Gas Cylinder leakage in Bachupally: హైదరాబాద్​లోని ఓ అపార్ట్​మెంట్​లో వంట గ్యాస్​ లీకై మంటలు వ్యాపించడంతో నలుగురు గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Gas Cylinder leakage in Bachupally
Gas Cylinder leakage in Bachupally

Gas Cylinder leakage in Bachupally : హైదరాబాద్​ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కౌసల్య కాలనీలోని సుఖి 9 అపార్ట్​మెంట్​లో వంట గ్యాస్​ లీకయ్యి మంటలు అంటుకున్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. అపార్ట్​మెంటులోని 1,608 ప్లాట్​లో వంటగ్యాస్ లీకయ్యి మంటలు వ్యాప్తించాయి.

ప్రమాదంలో వినీత్​ (25), విష్ణు (20), దొంగరి ప్రదీప్​ (26), భార్గవ (26) గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నిజాంపేటలోని ఎస్​ఎల్​జీ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Boy missing at Nandyal: నంద్యాలలో ఏడాదిన్నర బాలుడు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.