ETV Bharat / crime

father harassment: కన్నకూతురినే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరించిన తండ్రి

author img

By

Published : Aug 16, 2021, 10:58 AM IST

కన్నకూతురినే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరిస్తున్నాడు ఓ తండ్రి. ఆపదలో అండగా నిలవాల్సిన నాన్నే డబ్బు కోసం వేధిస్తున్నాడు. ఇల్లు వదిలి వెళ్లాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని(father harassment) బాధితురాలు వాపోయారు. ఆ కుటుంబానికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే..

father harassment
father harassment

ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తే.. పైగా డబ్బుల కోసం ఉన్నపలంగా ఆమెను ఇల్లు వదిలి వెళ్లమంటే ఆ కూతురు పరిస్థితి ఏంటి?. ఆపదలో అండగా నిలవాల్సిన నాన్నే ఇంటిని వదిలి వెళ్లాలని బలవంతం చేస్తే వారంతా ఎక్కడకు పోవాలి? భార్య పేరు మీదున్న ఆస్తి కోసం కన్నబిడ్డలను సైతం వేధిస్తుంటే ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది.

పిల్లలపై దాడి

తండ్రి వేధింపులు తాళలేక చివరకు ఆ కూతురు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారం చేయిస్తానంటూ కన్నకూతురిని బెదిరిస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో ఓ ఎంఫిల్‌ విద్యార్థిని తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు వదిలి వెళ్లాలంటూ కొంత కాలంగా ఆమెతో పాటు తల్లిని తండ్రి బెదిరిస్తున్నాడని ఎస్సై కన్నెబోయిన ఉదయ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లోకి వచ్చిన తండ్రి భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఆస్తి కోసమేనా..

తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలు చేసుకోవడంతో పాటు తమపై దాడికి దిగుతున్నాడని, ఇదేమని ప్రశ్నిస్తే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డబ్బు కోసం వేధింపులు

కామంతో కళ్లు మూసుకుపోయి కన్నకూతుళ్లపైనే అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే డబ్బు కోసం కుమార్తెపై రేప్ చేయిస్తానని బెదిరించడం ఆందోళన కలిగించే విషయమే. బయట ఏమైనా ఆపద వస్తే ఇంట్లో చెప్పుకోవాల్సిన ఆ యువతికి... తండ్రి రూపంలోనే ఇలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి. చేసేది లేక చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యకు పురుగుల మందు తాగించిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.