ETV Bharat / crime

Drugs in New Year Events: న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. మాల్​ రెడీ!

author img

By

Published : Dec 13, 2021, 12:37 PM IST

Drugs in New Year Events : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్​ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పబ్​లు, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్లు రిజర్వేషన్లు ప్రారంభించాయి. ఈ వేడుకల్లో మత్తు పదార్థాలదే హవా. మద్యం, గాంజా, డ్రగ్స్​.. న్యూ ఇయర్ సంబురాల్లో వీటికుండే క్రేజే వేరు. ఆ ఒక్కరోజే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. మరి వీటిని అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటి నుంచే నిఘా పటిష్ఠం చేశారు. ఈ ఏడాది కొత్త సంవత్సరానికి మత్తులో కాకుండా.. మంచి మనసుతో హాయిగా స్వాగతం పలికేలా కృషి చేస్తున్నారు.

Drugs in New Year
Drugs in New Year

Drugs in New Year Events : ‘‘పబ్‌లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తా’’మని హెచ్చరిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. నయాసాల్‌ 2022 వేడుకలకు ఇప్పటికే ఈవెంట్‌ సంస్థలు.. పబ్‌లు.. రిసార్ట్స్‌ రిజర్వేషన్లు ప్రారంభించాయి. యువతను లక్ష్యంగా చేసుకుని విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకల్లో వాటిదే హవా..

New Year Events in Hyderabad : కొత్త సంవత్సర వేడుకల్లో మాదక ద్రవ్యాలదే హవా. ఈ ఒక్కరోజే రూ.కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పబ్‌లు, రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు అధికంగా ఉండటం.. విందు, వినోద పార్టీలకు ఇక్కడ ఉన్న క్రేజ్‌తో మత్తు పదార్థాల విక్రయానికి భాగ్యనగరం కేంద్రంగా మారింది. నాలుగైదేళ్లుగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందని పోలీసులు వివరిస్తున్నారు. నాలుగైదు రాష్ట్రాలకు వెళ్లేందుకు అనువుగా రహదారులు ఉండటంతో ఇక్కడ మాదకద్రవ్యాలను నిల్వ చేస్తున్నారని ఇటీవల రాచకొండ పోలీసులు గుర్తించారు.

పాత స్మగ్లర్లపై నిఘా..

Alcohol in New Year Events : కొత్త సంవత్సరం వేడుకలకు భారీఎత్తున గంజాయి, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలు తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ కేంద్రంగా పలు రాష్ట్రాలకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇటీవల లింగంపల్లి వద్ద రైలులో అరకు నుంచి వచ్చిన గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల రాచకొండ పోలీసులు 1800 కిలోల గంజాయిను పట్టుకున్నారు. నగర శివార్లలో నిల్వచేసి అక్కడి నుంచి జహీరాబాద్‌ మీదుగా కర్ణాటక తరలించాలనేది ముఠా ఎత్తుగడ. ఈ లోపుగానే పోలీసులు గుర్తించటంతో పథకం బెడసికొట్టింది. దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ల్లోని నైజీరియా ముఠాలు ఇటీవల రహస్యంగా నగర శివార్లలోని హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మత్తుకు అడ్డుకట్ట..

Ganjayi in New Year Events : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా మాదకద్రవ్యాల రవాణాకు కొద్దిమేర అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో యువత కొత్తదారులు వెతుక్కున్నారు. ఫామ్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్స్‌, శివార్లలోని హోటళ్లను ఎంపిక చేసుకుని 4-5 మంది యువకులు కలసి మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పబ్‌లు, హోటళ్లు, రిసార్ట్స్‌పై నిఘా పెంచారు. ఇటీవల సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పోలీసు, ఎస్‌వోటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యువత పాల్గొనే వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : 'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.