Anganwadi student died by snake bite : కాటేసిన పాము.. కట్టుకట్టి నిద్రపుచ్చిన ఆయమ్మ

author img

By

Published : Nov 26, 2021, 10:54 AM IST

Updated : Nov 26, 2021, 5:50 PM IST

anganwadi-student-died-by-snake-at-gajwel-mandal-in-siddipet-district

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో విషాదం నెలకొంది. బయ్యారంలోని అంగన్వాడీకి వెళ్లిన ఓ చిన్నారి పాముకాటుకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి(Anganwadi student died by snake) చెందింది. పాముకాటును ఆయమ్మ గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారంలో విషాదం(siddipet district crime news) నెలకొంది. నవ్వులు చిందిస్తూ ఉదయం ఇంటి నుంచి అంగన్వాడీకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి పాముకాటుతో మృతి (Bayyaram student died by snake) చెందింది. పాముకాటుపై అవగాహన లేని ఆయమ్మ చేసిన నిర్వాకమూ చిన్నారి ప్రాణం పోయేందుకు కారణమైంది. కామల్ల రాజు - సంతోష దంపతుల కుమార్తె నిత్యశ్రీ(4) ఏడాదిన్నరగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది.

గురువారం రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కేంద్రం ముందు ఆడుకుంటున్న నిత్యశ్రీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఎడమకాలు పాదం వద్ద రక్తం కారటాన్ని గమనించిన ఆయమ్మ ఢాకమ్మ గాయం వద్ద పసుపురాసి, కట్టుకట్టి కేంద్రంలో పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత భోజనం పెట్టేందుకని చిన్నారిని లేపే ప్రయత్నం చేసింది. లేవకపోవడంతో కార్యకర్త అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది. వారంతా పాపను హుటాహుటిన గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు పాముకాటుతో చిన్నారి మృతి(student died by snake) చెందినట్టు ధ్రువీకరించారు. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే మురుగు కాల్వ, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ ఉన్నాయి. మూత్ర విసర్జన కోసం ప్రహరీ వద్దకు వెళ్లిన సమయంలో పాము కాటేసి ఉంటుందనే అనుమానంతో స్థానికులు అక్కడ పరిశీలించారు. గోడ మధ్యలో రంధ్రాలను గుర్తించి తవ్వారు. రెండు నాగుపాము పిల్లలను గుర్తించి చంపేశారు. పాముకాటును ఆయమ్మ గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: Mother Murdered by Son: పెళ్లి చేయట్లేదన్న కోసంతో.. తల్లిని హతమార్చిన కొడుకు

Last Updated :Nov 26, 2021, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.