ETV Bharat / crime

Prisoner Escaped: అతనికి జైలు గోడలు... పిట్టగోడలతో సమానం

author img

By

Published : Mar 17, 2022, 4:55 PM IST

Updated : Mar 17, 2022, 5:48 PM IST

Prisoner Escaped: ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి పరారయ్యాడు. అతను ఇలా పారిపోవడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. మొదటిసారి తప్పించుకున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. రెండోసారి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఇలా పారిపోవడానికి కారణం ఎంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

prisoner escaped from kurnool district jail
కర్నూలు జిల్లా కారాగారం నుంచి నిందితుడు పరారు

Prisoner Escaped: కర్నూలు జిల్లా కారాగారం నుంచి నిందితుడు చెంచు కుళాయి అలియాస్ నాని ఈ వారం రోజుల్లో రెండోసారి తప్పించుకున్నాడు. హత్యాయత్నం కేసులో గత నెల 16వ తేదీ నుంచి జైలులో ఖైదీ గా ఉన్న నాని వారంరోజుల వ్యవధిలో రెండు సార్లు కారాగారం నుంచి తప్పించుకున్నాడు. గత శుక్రవారం నాని ఇదే జైలు గోడ దూకి తప్పించుకొని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వలో అతని అక్క ఇంటికి వెళ్లగా జైలు సిబ్బంది పట్టుకున్నారు. దీంతో నిందితుడిపై తాలూకా అర్బన్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అప్పటునుంచి జైలు సిబ్బంది అతడిని ప్రత్యేక బారక్​లో ఉంచగా ఈరోజు ఉదయం బాత్​రూంకి వెళ్తానని చెప్పి మరోసారి గోడ దూకి తప్పించుకొని పోవడంతో జైలు సిబ్బంది అతని కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా మహనంది మండలం అబ్బీ పురం గ్రామానికి చెందిన నల్లబోతుల కుళ్లాయికి ఇరవై సంవత్సరాలు ఉంటాయి. అతనికి ఇంకా వివాహం కాలేదు. కుళ్లాయికి చెట్లు ఎక్కే అలవాటు ఉన్నందున జైలులో గోడలు దూకడం సులభం కావడంతో జైలు సిబ్బంది కళ్లు కప్పి గోడదూకి పారిపోతున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఒక ముద్దాయి రెండు సార్లు తప్పించుకొనిపోవడంతో ఉన్నతాధికారులు జైలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి: Perni On RRR Movie: జీఎస్టీ చెల్లించిన తర్వాతే.. 'ఆర్​ఆర్​ఆర్​' టికెట్ల ధర పెంపు: మంత్రి పేర్ని

Last Updated :Mar 17, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.