ETV Bharat / crime

ఊరెళ్లొద్దన్నందుకు ఊపిరి తీశాడు.. 17 రోజులకు వీడిన జంట హత్యల మిస్టరీ

author img

By

Published : Aug 12, 2022, 1:18 PM IST

MURDER CASE: హైదరాబాద్ శివారు జీడిమెట్ల పోలీస్​స్టేషన్ పరిధిలోని రాంరెడ్డి నగర్​లో జరిగిన జంటహత్యల కేసును పోలీసులు చేధించారు. ఉపాధి దొరకలేదని తిరిగి వెళ్తానంటే వెళ్లనివ్వలేదనే కోపంతో.. భునేశ్వర్‌సింగ్‌ ఆ ఇద్దర్నీ హతమార్చాడని బాలానగర్ ఏసీపీ గంగారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

MURDER CASE
MURDER CASE

MURDER CASE: ఉపాధి దొరకలేదని తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్‌సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల పోలీస్​స్టేషన్ రాంరెడ్డినగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు 17 రోజుల తర్వాత చిక్కుముడి వీడింది. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్‌ ఏసీపీ గంగారం వివరాలు వెల్లడించారు.

ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బీరేంద్రకుమార్‌ జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేశాడని ఏసీపీ గంగారాం తెలిపారు. సొంతూరికి వెళ్లి గతనెల 26న.. 9 మందిని వెంటబెట్టుకుని నగరానికి వచ్చాడని చెప్పారు. వారికి పని కల్పించాలని ఓ పరిశ్రమకు వెళ్లాడు. కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. మిగిలిన నలుగురు ఇబాదత్‌ అన్సారీ, ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌, భునేశ్వర్‌సింగ్​తో కలిసి బీరేంద్రకుమార్‌ రాంరెడ్డినగర్‌లోని గదికి వెళ్లారు.

ఈ క్రమంలో భునేశ్వర్‌సింగ్‌ తిరిగి సొంతూరికి వెళ్తానని బీరేంద్రకుమార్‌ చెప్పగా అతడు వద్దని చెప్పాడని ఏసీపీ తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. గొడవ తీవ్రం కావడంతో సహనం కోల్పోయిన భునేశ్వర్‌.. కట్టెతో బీరేంద్రకుమార్‌ తలపై కొట్టాడని చెప్పారు. ఇబాదత్‌ అన్సారీ అడ్డుకోగా అతన్నీ విచక్షణా రహితంగా కొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు. నిందితుడు తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని తెలియజేశారు.

వెంటనే అక్కడున్న రెండు గ్యాస్‌ సిలిండర్లను లీక్‌ చేసి భునేశ్వర్‌సింగ్‌ నిప్పంటించాడని తెలిపారు. మంటలు వ్యాపించడంతో భయంతో కిటికీలో నుంచి దూకి పారిపోయాడని చెప్పారు. పక్కన గదిలో ఉన్న ఇమాముద్దీన్‌, కలీముద్దీన్‌.. పేలుడు ధాటికి భయపడి కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భునేశ్వర్‌సింగ్‌ ఝార్ఖండ్‌లోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి అతన్ని పట్టుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ గంగారం పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.