ETV Bharat / city

'ఈ నెల 28న విశాఖ బంద్.. అందరు సహకరించాలి'

author img

By

Published : Mar 22, 2022, 7:37 PM IST

Visakha Bandh : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న తలపెట్టిన విశాఖ బంద్​కు అందరు సహకరించాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ బంద్​లో వైకాపా నేతలు ప్రత్యక్షంగా పాల్గొనాలని తెదేపా నేత పీలా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలు విశాఖలో ఒక విధంగా, దిల్లీలో మరో విధంగా వ్యవహరించరాదన్నారు.

Visakha Bandh
Visakha Bandh

Visakha Bandh : ఈ నెల 28వ తేదీన తలపెట్టిన విశాఖ బంద్​కు అన్ని పార్టీలు సహకరించాలని కోరుతూ...అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా ఎంపీలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్​లో తమ గళం వినిపించాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పీలా శ్రీనివాసరావు కోరారు. విశాఖలో ఒక విధంగా, దిల్లీలో మరో విధంగా వ్యవహరించరాదని హితవు పలికారు. విశాఖలో తలపెట్టిన బంద్​లో వైకాపా నేతలు ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఐఎన్డీయూసీ నాయకుడు రాజశేఖర్ తెలిపారు. భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు విక్రయించాలని కుట్రపన్నుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు, తెదేపా నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విశాఖ బంద్‌కు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి పిలుపు...ఎప్పుడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.