ETV Bharat / city

'విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారు'

author img

By

Published : Feb 19, 2021, 8:24 PM IST

విజయసాయిరెడ్డి ప్రోద్బలంతో జీవీఎంసీ పరిధిలోని వార్డుల రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని జీవీఎంసీ కమిషనర్​కి తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి కమిషనర్​కు వివరించారు.

Telugu_Shakthi_Memorandam_To_GVMC_Commissioner in visakhapatnam
'విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారు'

విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని జీవీఎంసీ కమిషనర్​కి తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి కమిషనర్​కు వివరించారు.

జీవీఎంసీ కమిషనర్ సృజన బదిలీపై వెళ్ళటం.. పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. వైకాపాకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఈ సందర్భంగా బీవీ రామ్ ఆరోపించారు. గత కమిషనర్ నివేదిక ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టారని తెలిపారు. ఇప్పటికైనా దీనిపై పూర్తి నివేదిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు సమర్పించాలని విజ్ఞప్తి చేస్తూ కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని బీవీ రామ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లాలో రథసప్తమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.