ETV Bharat / city

VISHAKA STEEL FIGHT: దిల్లీలో ఉక్కు ఉద్యమ కార్మికులు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు నిరసనలు

author img

By

Published : Aug 1, 2021, 8:26 PM IST

Updated : Aug 2, 2021, 7:26 AM IST

దిల్లీ వీధుల్లో ఉక్కు ఉద్యమ నినాదాలు వినిపించేందుకు కార్మికులు, నిర్వాసితులు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు జంతర్‌మంతర్‌, ఆంధ్ర భవన్‌ వద్ద నిర్వహించబోయే మహానిరసనకు వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. విశాఖ నుంచి వాయు, రైలు మార్గాల్లో దిల్లీకి చేరుకున్న కార్మికులు, నేతలు జంతర్‌మంతర్‌ వైపుగా అడుగులు వేస్తున్నారు.

దిల్లీ బయలు దేరిన విశాఖ ఉక్కు కార్మిక నేతలు
దిల్లీ బయలు దేరిన విశాఖ ఉక్కు కార్మిక నేతలు

దిల్లీలో ఉక్కు ఉద్యమ కార్మికులు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... 170 రోజులుగా కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కేంద్రం స్పందించకపోవటంతో... తాడోపేడో తేల్చుకోవటమే లక్ష్యంగా ఉక్కు ఉద్యమ పోరాట సమితి అడుగులు వేసింది. పార్లమెంట్‌ ఉభయ సభలు జరుగుతున్న సమాయంలోనే దిల్లీలో ఉద్యమవాణి వినిపించాలని నిర్ణయించారు. నేడు జంతర్‌మంతర్‌ వద్ద... రేపు ఆంధ్రభవన్‌లో మహానిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నిన్న విశాఖ నుంచి బయలుదేరి దిల్లీకి చేరుకున్న ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట సమితి నేతలు, కార్మికులు... దేశరాజధాని వీధుల్లో ఉక్కు నినాదాలు మారుమోగించాలని నిర్ణయించుకున్నారు.

అన్ని వర్గాల సంఘీభావం

ఉక్కు ఉద్యమానికి వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దిల్లీలో కార్మికులు చేయబోయే ఉద్యమంలోనూ పాల్గొనేందుకు పలుపార్టీల నేతలు రాబోతున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో పలు పార్టీలకు చెందిన నేతలు ఉక్కు ఉద్యమంపై గళాన్ని వినిపిస్తారని వెల్లడించారు. పార్లమెంట్‌, కోర్టులో ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రం ప్రకటన చేస్తోందని తెలిపారు. ఇకపై పోరాటాన్ని ఉద్యమం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.

దిల్లీకి పయానం

కార్మికులతోపాటే వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు, విశాఖ డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు తదితర నేతలు దిల్లీకి వెళ్లారు. ప్రైవేటీకరణ ఆపేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్రం మొండిగా ముందుకెళ్తోందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. దిల్లీలో రెండు రోజులపాటు జరగబోయే ఉద్యమంలో తాము భాగస్వాములవుతామని తెలిపారు.

దిల్లీ బయలు దేరిన విశాఖ ఉక్కు కార్మిక నేతలు

ఇప్పటివరకూ జరిగిన ఉద్యమం ఒక ఎత్తు... ఇకపై జరగబోయే పోరాటం మరో ఎత్తు అని కార్మికులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునేవరకూ వెనక్కితగ్గేది లేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

Last Updated :Aug 2, 2021, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.