ETV Bharat / city

అవంతి గారూ.. మీరు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు: రఘురామకృష్ణరాజు

author img

By

Published : Jul 26, 2020, 11:00 PM IST

వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. మరోసారి సెటైర్ వేశారు. కరోనా విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ జ్ఞానామృతాన్ని పంచుతున్నారని.. అందుకు ఆయనకు ధన్యవాదాలు అంటూ.. ఎద్దేవా చేశారు.

raghuramakrishnaraju comments on minister avanthi srinivas
raghuramakrishnaraju comments on minister avanthi srinivas

పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా వస్తుందని మంత్రి అవంతి చెబుతున్నారని.. కానీ విశాఖకు చెందిన విద్యావేత్త నలంద కిశోర్ ప్రభుత్వ తీరు వల్లే చనిపోయారని రఘురామకృష్ణరాజు అన్నారు. నలంద కిశోర్​ది ముమ్మాటికీ సాధారణ మరణం కాదని, పోలీస్ లు దుందుడుకుగా కర్నూలు తీసుకెళ్లడం వల్లనే ఆయన చనిపోయారని ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు విశాఖ కన్నా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాదిరిగా తాను కేవలం ఒక్కరి ఫొటో వల్లనే గెలవలేదని సొంత చరిష్మా కూడా తోడైందని చెప్పారు. తనపై విమర్శలు చేయడం వలన అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పదిలంగా ఉంటుందని ఆశిస్తున్నాన్నారు.

ఇదీ చదవండి: ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించం: మంత్రి అవంతి శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.